Home Filmy Adda గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ఈ హీరోయిన్.. ఎవరో తెలుసా..!

గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ఈ హీరోయిన్.. ఎవరో తెలుసా..!

by Sunku Sravan

Ads

సినిమారంగంలో టాలెంట్ తో పాటుగా కాస్త అదృష్టం కూడా కలిసి రావాలని అంటుంటారు సినీ పెద్దలు. కృషి,పట్టుదల ఉన్న వారు ఎవరైనా సరే మంచి పేరు తెచ్చుకుంటారని సినీ ప్రముఖులు అంటుంటారు. కానీ కొంతమంది సినిమాల్లో ఎంత తొందరగా పేరు తెచ్చుకుంటారో మళ్లీ అంత తొందరగా తెర మరుగు అయిపోతారు. అలా చాలా రోజుల తర్వాత మళ్లీ వారు కనిపిస్తే ప్రేక్షకులకు భలే ఆనందంగా అనిపిస్తుంది.

Video Advertisement

అలాంటి వాటితో మనల్ని అలరిస్తున్న కమెడియన్ ఆలీ ఈ షో ద్వారా తెర మరుగైన సినీ ప్రముఖులను చూపిస్తూ అలరిస్తున్నారు. ఇందులో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతూ అనేక ఎపిసోడ్స్ తో మన ముందుకు వస్తున్నారు ఆలీ. తెలుగు ఇండస్ట్రీలో తనదైన కామెడీతో ఎంతో పేరు సంపాదించిన ఆలీ మళ్లీ ఆలీతో సరదాగా అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందిస్తున్నాడు.

ఇందులో ముఖ్యంగా పాత హీరో లను మరియు హీరోయిన్ లను మళ్లీ తెర పైన చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసి నటనకు దూరంగా ఉన్నటువంటి ఎంతోమందిని ఈ షో కు పిలిపించి వారి జీవితంలో జరిగే విశేషాల గురించి అందరికీ తెలిసేలా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఈ షో ద్వారా 46 ఏళ్ల వయసులో ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి వచ్చింది శుభశ్రీ.

దీంతో ఈమెను చూసి అభిమానులు అవాక్కయ్యారు. శుభ శ్రీ లో ఎంత మార్పు వచ్చిందని అనుకుంటున్నారు. ఎప్పుడో ఎంగేజ్ లో చూసినటువంటి వారు 46 సంవత్సరాల తర్వాత చూస్తే ఎలా ఉంటుందో మీరే చెప్పండి. ఏది ఏమైనా అలనాటి అమ్మడును మరోసారి తెరమీదకు తీసుకువచ్చిన ఆలీ కి థాంక్స్ చెబుతున్నారు అభిమానులు.


End of Article

You may also like