ఫేస్ మాస్క్ లు ధరించడం ఇప్పుడు తప్పని సరి కావడంతో ప్రజలు ఎన్నో కొత్త ఆవిష్కరణలతో ముందుకు వస్తున్నారు. కొట్టాయం లోని ఎత్తుమానూర్ కి చెందిన బినేష్ జి పాల్ అనే 38 ఏళ్ల డిజిటల్ ఫోటోగ్రాఫర్ అక్కడి ప్రజల ముఖాలతో ప్రత్యేకంగా తయారు చేసిన ఫేస్ మాస్క్ లను తయారు చేసి విక్రయిస్తున్నారు.ఈ మాస్కుల వల్ల జనాలకి ఆ మనిషి ఎవరో గుర్తుపట్టడం సులభం అవుతుంది అని అందుకే ఇలాంటి మాస్క్ తయారు చేస్తున్నాను అని పాల్ చెప్పారు.
ఏటీఎంలలో విమానాశ్రయాల్లో పరీక్షా హాలులో మరియు ఇతర చోట్ల తనిఖీ చేసేటప్పుడు సాధారణ మాస్కుల వల్ల ఇబ్బంది అవుతుంది. ఇంకా ఎన్నో కొత్త సమస్యలను సృష్టిస్తుంది. ఇలా వాళ్ళ ముఖం ఉండే మాస్కులు వాడితే సులభంగా ఏ ఇబ్బంది లేకుండా తనిఖీ చేయవచ్చు. మన ప్రధాని మోడీ చెప్పినట్టు మన ప్రతి సమస్యను కొత్త ఆవిష్కరణకు అవకాశంగా మార్చుకోవాలి. అని బినేష్ అన్నారు.
ప్రజలు మాస్కులు పై తమ ముఖాల కోసం సెల్ఫీ లేదా ఏదైనా హై రిజల్యూషన్ కెమెరా లో దిగిన ఫోటో అయినా పంపియచ్చు. అలా పంపించిన ఫోటోలని పాల్ సబ్లిమేషన్ ప్రింటింగ్ సహాయంతో ఒక కాగితం మీద ప్రింట్ చేస్తాడు. తర్వాత దాన్ని ఒక వస్త్రం పై ప్రింట్ చేసి మాస్కు తయారు చేస్తారు. ఫోటోను ప్రింట్ చేయడానికి 20 నిమిషాలు పడుతుంది. ఫేస్ మాస్క్ ధర 60 రూపాయలు. దేశవ్యాప్తంగా పలు షాపులు ఫిల్మ్ పోస్టర్లు, బాలీవుడ్ స్టార్స్, ఇంకా కార్టూన్ క్యారెక్టర్ల ముఖాలతో రూపొందించిన మాస్క్ లను అమ్మడం ప్రారంభించాయి.
At Kottayam, Kerala, they print your face on the mask so that even when you wear the mask, people can recognise you. It takes 15 minutes to print. Cost – ₹60. #innovation #ideas pic.twitter.com/VDk4WNzyPd
— Ananth Rupanagudi (@rananth) May 24, 2020