Ads
దేవుడా..! ఈ వ్యక్తి మోసాలు చేయడంలో ఆరితేరి పోయాడు. సాధారణంగా ఎవరైనా ఒకటి లేదా రెండు పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇతను మాత్రం నిత్య పెళ్లి కొడుకు. ఏకంగా 14 సార్లు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఎక్కువగా ఇతను మధ్య వయస్సు ఉన్న మహిళలను టార్గెట్ చేస్తాడు.
Video Advertisement
అలానే విడాకులు తీసుకున్న వాళ్ళని కూడా టార్గెట్ చేసి మోసం చేస్తూ ఉంటాడు. ఇక మరి 14 పెళ్లి చేసుకున్న ఆ నిత్య పెళ్లి కొడుకు గురించి చూద్దాం. ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం బిధు ప్రకాష్ స్వైన్ (54) ఒడిస్సా కి చెందిన వ్యక్తి. ఏం చేస్తాడో తెలీదు కానీ డాక్టర్ అని చెప్పుకుని తిరుగుతూ ఉంటాడు.
వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలను మోసం చేస్తాడు. పెళ్లి పేరుతో ఇలా చాలా మందిని ఇప్పటికే బిధు ప్రకాష్ మోసం చేశాడు. మొదటిసారి 1982లో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుండి డాక్టర్ ని అని చెప్పుకొని 13 పెళ్లిళ్లు చేసుకున్నాడు. బాగా చదువుకుని గవర్నమెంట్ ఆఫీస్ లో పని చేస్తున్న మహిళల్ని… విడాకులు తీసుకున్న మహిళలనీ మ్యాట్రిమోనీ వెబ్సైట్ల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటాడు. భారీగా కట్నం తీసుకుంటాడు.
representative image
చెప్పుకుపోతే సినిమాటిక్ రేంజ్ లో ఉంటుంది ఇతని కధ. ఢిల్లీ, అస్సాం, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పంజాబ్ ఇలా వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళల్ని పెళ్లి చేసుకుని మోసం చేశాడు. పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల తర్వాత పని మీద భువనేశ్వర్ వెళ్తున్నా అని చెప్పి మళ్లీ కనిపించేవాడు కాదు. 2021 జూలైలో ఒక టీచర్ ని ఢిల్లీలో పెళ్లి చేసుకున్నాడు.
representative image
ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఆమెతో ఉండి.. తరవాత వదిలి వెళ్లిపోయాడు. ఆమె ఊరుకోక పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఆఖరికి భువనేశ్వర్ వెళ్లి అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఈ ఒక్క మహిళలనే కాదు 13 మంది మహిళలని ఇలాగే మోసం చేశాడని పోలీసులు తెలుసుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
End of Article