Ads
ఎంతో కాలం వెయిట్ చేసిన తర్వాత డిసెంబర్లో పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది.
Video Advertisement
దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు. అయితే, పుష్ప సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వచ్చింది. పుష్ప సినిమా థియేటర్లలో నడుస్తుండగానే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. హిందీ వెర్షన్ తో సహా అన్ని భాషల్లో సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.
పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయినప్పటికంటే, అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయిన తర్వాతే సినిమాకి చాలా మంచి టాక్ వచ్చింది. ఎంతో మంది సెలబ్రిటీలు సినిమా చూసి, సినిమా చాలా బాగుంది అని, అల్లు అర్జున్ ఈ సినిమాలో చాలా బాగా నటించారు అని సోషల్ మీడియా ద్వారా పొగిడారు. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు మాత్రమే కాకుండా, బాలీవుడ్ కి సంబంధించిన ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ నటనని ప్రశంసించారు. దాంతో పుష్ప రెండవ పార్ట్ విడుదలకి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం విజయ్ సేతుపతి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర ఒక నెగిటివ్ పాత్ర అనే వార్తలు వస్తున్నాయి. మొదటి పార్ట్ లో విలన్ గా నటించిన ఫహాద్ ఫాజిల్ ఇందులో కూడా ఉంటారు. ఇప్పుడు విజయ్ సేతుపతి కూడా మరొక విలన్ పాత్రలో నటిస్తున్నారు. అంతే కాకుండా విజయ్ సేతుపతి కూడా మరొక పోలీస్ పాత్రలో కనిపిస్తారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం అయితే సినిమా బృందం కథకి సంబంధించిన చర్చల్లో ఉంది. సినిమా షూటింగ్ కూడా మరికొద్ది రోజుల్లో మొదలవుతుంది అని సమాచారం.
End of Article