Home Filmy Adda Bigg Boss : 35 లక్షల రెమ్యూనరేషన్ తో బిగ్‌బాస్ లోకి అడుగుపెట్టనున్న ఈ సెన్సేషనల్ హీరోయిన్.!

Bigg Boss : 35 లక్షల రెమ్యూనరేషన్ తో బిగ్‌బాస్ లోకి అడుగుపెట్టనున్న ఈ సెన్సేషనల్ హీరోయిన్.!

by Mohana Priya

బిగ్ బాస్ ప్రోగ్రాం తెలుగులో మాత్రమే కాకుండా మిగిలిన భాషలలో కూడా టెలికాస్ట్ అవుతుంది. ప్రతి ఒక్క భాషలో ఆ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సెలబ్రెటీ హోస్ట్ గా వ్యవహరిస్తారు. హిందీలో సల్మాన్ ఖాన్, తమిళ్ లో కమల్ హాసన్, కన్నడలో సుదీప్, మలయాళంలో మోహన్ లాల్ హోస్ట్ చేస్తారు. హిందీ బిగ్ బాస్ కి మాత్రం దేశవ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంటుంది. అప్పట్లో చాలా పాపులర్ అయిన స్టార్ నటులతో పాటు, సీరియల్ నటులు అలాగే సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వాళ్ళు, ఇలా ఎంతో మంది ఆ ప్రోగ్రాంలో పాల్గొంటారు. bigg boss next season confirmed contestant

బిగ్ బాస్ లో పాల్గొని తర్వాత గుర్తింపు తెచ్చుకున్న సెలబ్రిటీస్ ఎంతో ఎంతోమంది ఉన్నారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత సీజన్ ప్రారంభం అవుతోంది ఇందుకోసం కూడా కొంత మంది చర్చలో నిలిచిన సెలబ్రిటీల పేర్లు పరిగణనలోకి తీసుకుంటన్నట్లు సమాచారం. వీరిలో మొట్టమొదటిగా ఉన్న పేరు నటి రియా చక్రవర్తి. రియా చక్రవర్తి గత సంవత్సరం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో చర్చల్లో నిలిచారు. దాంతో రియాని బిగ్ బాస్ షో కి తీసుకురావాలి అని షో నిర్వాహకులు అనుకుంటున్నారని సమాచారం.rhea chakraborthy

ఇందుకోసం రియల్ చక్రవర్తికి పారితోషకం కూడా భారీగానే ఇవ్వబోతున్నారు. వారానికి 35 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ గా బిగ్ బాస్ యాజమాన్యం రియా చక్రవర్తికి ఇవ్వబోతున్నట్లు సమాచారం. షో రూల్స్ ప్రకారం బయట జీవితానికి సంబంధించిన విషయాలని షోలో మాట్లాడకూడదు. దాంతో రియా చక్రవర్తి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు షోలో ప్రస్తావించరు. కానీ నెక్స్ట్ సీజన్ లో రియా చక్రవర్తి పాల్గొనబోతున్నట్టు మాత్రం గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి.

You may also like