Ads
చిరంజీవి, రామ్ చరణ్ కలిసి తెరపై కనిపిస్తే చూడాలని చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూశారు. అంతకుముందు మగధీర సినిమాలో, ఆ తర్వాత బ్రూస్ లీ సినిమాలో చిరంజీవి చిన్న పాత్రలో కనిపించారు. అలా కాకుండా వారిద్దరూ కలిసి ఒక ఫుల్ లెంత్ సినిమాలో నటించాలి అని అందరూ అనుకున్నారు.
Video Advertisement
ఆచార్య సినిమాతో అది జరుగుతుంది అని తెలిసాక అసలు సినిమా ఎలా ఉండబోతోంది? ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయా? అని అనుకున్నారు. కానీ సినిమా విషయానికి వచ్చేటప్పటికీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు అని చెప్పాలి.
సినిమా కథ మనం చాలా సినిమాల్లో చూశాం. సినిమా నడుస్తున్న కొద్దీ ఏమవుతుంది అనే ఆసక్తి ఎవరిలో ఉండదు. ఎందుకంటే ఏమవుతుంది అనేది అందరికీ తెలిసిపోయి ఉంటుంది. చాలా చోట్ల సినిమా డల్ గా అనిపిస్తుంది. అయితే సాధారణంగా ఒక సెంటిమెంట్ ఉంది. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది అని అంటున్నారు. అదేంటంటే సాధారణంగా రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఆ హీరో నటించిన సినిమా కచ్చితంగా నెగిటివ్ టాక్ తెచ్చుకుంటుంది. చాలా సార్లు ఈ విషయం రుజువైంది. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా ఇది.
ఇది అంతకు ముందే విడుదలవ్వాల్సి ఉన్నా కూడా చాలా కారణాల వల్ల ఇప్పుడు విడుదల అయ్యింది. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. సినిమా చూసిన వారందరూ కూడా కచ్చితంగా స్టార్ హీరోల రేంజ్ కి తగ్గ సినిమా కాదు అని అంటున్నారు. అందుకే రామ్ చరణ్ విషయంలో కూడా ఇదే జరిగిందా అని అంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
End of Article