Home Filmy Adda ఈ సోషల్ మీడియా స్టార్ కూతురు చాలా ఫేమస్ నటి అని తెలుసా..? ఎవరంటే..?

ఈ సోషల్ మీడియా స్టార్ కూతురు చాలా ఫేమస్ నటి అని తెలుసా..? ఎవరంటే..?

by Mohana Priya

మన ఇండస్ట్రీలో సినీ నేపథ్యంతో వచ్చిన సెలబ్రిటీలు ఎంత మంది ఉన్నారో, సినీ నేపథ్యం లేకుండా వచ్చిన సెలబ్రిటీలు కూడా అంత మందే ఉన్నారు. అయితే, అప్పట్లో వాళ్ల వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల వాళ్ళు తమ కుటుంబానికి సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటున్నారు. అలా వారి కుటుంబ సభ్యులు కూడా చాలా ఫేమస్ అవుతున్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ ఉంటారు. అలా ఒక ప్రముఖ నటి తల్లి సోషల్ మీడియాలో చాలా పెద్ద ఫేమస్ సెలబ్రిటీ అయ్యారు. ఇంస్టాగ్రామ్ లో తరచుగా రీల్స్ చేస్తూ ఉంటారు.

this social media celebrity daughter is a star

ఆమె పేరు లత. లతా గారు ఇంస్టాగ్రామ్ లో స్టార్ సెలబ్రిటీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో లతా గారు తెలియని వారు ఉండరు ఏమో. అయితే, లతా గారి కూతురు కూడా చాలా పెద్ద ఫేమస్ సెలబ్రిటీ. ఆమె పేరు కూడా తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఆ అమ్మాయి పేరు అందరికీ తెలుసు. ఆమె శ్రీముఖి. యాంకరింగ్ తో పాటు, నటనలో కూడా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు శ్రీముఖి. ప్రస్తుతం వరుస షోస్ తో, సినిమాలతో బిజీగా ఉండడంతో పాటు, యూట్యూబ్ ఛానల్ లో వీడియోస్ కూడా షేర్ చేస్తూ చాలా యాక్టివ్ గా ఉన్నారు.

this social media celebrity daughter is a star

 

సోషల్ మీడియాలో కూడా శ్రీముఖి చాలా యాక్టివ్ గా ఉంటారు. అలాగే లతా గారు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ షేర్ చేస్తూ ఉంటారు. శ్రీముఖి తండ్రి రామ్ కిషన్ గారు కూడా చాలా యాక్టివ్ గా సోషల్ మీడియాలో వీడియోస్, ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. లతా గారు సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉంటారు. పాత పాటల నుండి, ఇటీవల వచ్చినప్పుడు పాట వరకు చాలా పాటల మీద రీల్స్ చేశారు. సోషల్ మీడియాలో లతా గారికి కూడా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

watch video :

ALSO READ : “వింటున్నాము కదా అని ఏది పడితే అది చెప్తారా..?” అంటూ… “విజయ్ దేవరకొండ” మీద కామెంట్స్..!

You may also like