పుష్ప -2 లో ఆ స్టార్ హీరోయిన్ సాంగ్..! కానీ ట్విస్ట్ ఏంటంటే..?

పుష్ప -2 లో ఆ స్టార్ హీరోయిన్ సాంగ్..! కానీ ట్విస్ట్ ఏంటంటే..?

by Mohana Priya

Ads

ఎంతో కాలం వెయిట్ చేసిన తర్వాత గత సంవత్సరం డిసెంబర్‌లో పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది.

Video Advertisement

దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు. అయితే, పుష్ప సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వచ్చింది. పుష్ప సినిమా థియేటర్లలో నడుస్తుండగానే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. హిందీ వెర్షన్ తో సహా అన్ని భాషల్లో సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.

పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయినప్పటికంటే, ఇప్పుడే చాలా మంచి టాక్ వస్తోంది. ఎంతో మంది సెలబ్రిటీలు సినిమా చూసి, సినిమా చాలా బాగుంది అని, అల్లు అర్జున్ ఈ సినిమాలో చాలా బాగా నటించారు అని సోషల్ మీడియా ద్వారా పొగుడుతున్నారు. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు మాత్రమే కాకుండా, బాలీవుడ్ కి సంబంధించిన ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ నటనని ప్రశంసించారు. దాంతో పుష్ప రెండవ పార్ట్ విడుదలకి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు మరొక విషయం బయటికి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో కూడా ఒక స్టార్ హీరోయిన్ తో స్పెషల్ సాంగ్ చేయించాలి అని సినిమా బృందం అనుకుంటున్నట్లు సమాచారం. మొదట కాజల్ ఈ పాటలో నటిస్తారు అని అన్నారు. ఇప్పుడు ఈ పాటలో తమన్నా నటిస్తారు అని చెబుతున్నారు. ఏదేమైనా సరే స్టార్ హీరోయిన్ తో పాట మాత్రం సినిమాలో కచ్చితంగా ఉంటుంది అని అంటున్నారు. అలాగే తమన్నా స్పెషల్ సాంగ్ చేయడం మాత్రమే కాకుండా ఒక ముఖ్యమైన పాత్రలో కూడా నటిస్తున్నారు అనే వార్త వచ్చింది. మొదటి పార్ట్ తో పోలిస్తే ఈ సినిమాలో కథ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే ఈ సినిమా బృందం ప్రకటించేంత వరకు ఆగాల్సిందే.


End of Article

You may also like