పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. మూడు ముళ్ళతో ఒకటైన బంధం జీవితాంతం కలిసి ఒకరికొకరు తోడుగా, నీడగా ఉండాలి. అలానే పెళ్లి అనేది స్వర్గంలో నిర్ణయించబడుతుంది. ఎవరికి ఎవరితో ముడిపడింది అనేది ముందే నిర్ణయించడం జరుగుతుంది. అయితే తాజాగా ఒక జంట మూడు ముళ్ళతో ఒక్కటయ్యారు.

Video Advertisement

చూడడానికి ఆ జంట చూడముచ్చటగా ఉంది. ప్రస్తుతం వీళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే.. వరుడు విష్ణుకి 28 ఏళ్లు. వధువు జ్యోతికి 25 ఏళ్లు. కానీ వయసు పెద్ద అయినా సరే శరీరంలో పెరుగుదల లేదు. ఇద్దరూ బెంగళూరులో ఉద్యోగాలు కూడా చేస్తున్నారు.

తాజాగా కర్ణాటకలో చింతామణి వద్దనున్న కైవార క్షేత్రంలో వివాహమైంది. వీళ్ళిద్దరి ఫోటోలు చూస్తే వీళ్లది బాల్య వివాహమా అని అనుమానం కలుగుతుంది. ఎందుకంటే వరుడు విష్ణు కేవలం మూడు అడుగులు ఉంటారు. జ్యోతి రెండు అడుగుల ఎత్తు ఉంటుంది. ఇద్దరూ కలిసి ఏడు అడుగులు వేసి ఒకటయ్యారు.

Thank God for marriage

బంధుమిత్రుల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా పెళ్లి వైభవంగా జరిగింది. ఇద్దరూ మరుగుజ్జులు కావడంతో పెద్దలు చేసిన పెళ్లి ప్రయత్నాలు చాలా బెడిసికొట్టాయి. అయితే వీళ్ల పెళ్ళి ముందే నిర్ణయించబడింది ఏమో అన్నట్లు జరిగింది అంతా. పెద్దలు చేసిన పెళ్లి ప్రయత్నాలు ఫలించాయి. విష్ణు కుటుంబానికి జ్యోతి గురించి తెలియడంతో.. వెంటనే పెద్దలను సంప్రదించి సంబంధం కుదుర్చుకున్నారు. ఈ పెళ్లి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. నేటిజన్లు వీళ్లిద్దరినీ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.