Home News ఒకేరోజు ఒకే హాస్పిటల్ లో ప్రసవించిన ముగ్గురు అక్క చెల్లెళ్లు

ఒకేరోజు ఒకే హాస్పిటల్ లో ప్రసవించిన ముగ్గురు అక్క చెల్లెళ్లు

by Megha Varna

మనం సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రంగాలలో దూసుకెళ్ళతున్నాం కాని ఇంకా ప్రపంచంలో జరుగుతున్న కొన్ని సంఘటనలకు సమాధానాలు చెప్పలేక తలలు బాదుకుంటున్నాం.ఇలా ఎందుకు జరుగుతుంది అన్న ప్రశ్నకు మన పరిశోధకులు కూడా సమాధానం చెప్పలేకున్నారు.తాజాగా ఇలాంటి ఘటన అమెరికాలోని ఒహియోలో చోటు చేసుకుంది.

జులై 3వ తేదీన దనీషా హయ్నెస్, ఎరియల్ విలియమ్స్, ఆస్లే హయ్నెస్ అనే ముగ్గురు అక్కా చెల్లెళ్లు పురిటి నొప్పులతో అమెరికాలోని ఒహియో మ్యాన్స్‌ఫీల్డ్ హాస్పిటల్‌లో చేరారు. నాలుగు గంటల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు తమ బిడ్డలకు సిజేరియన్ కాకుండా సహజ పద్ధతిలోనే జన్మనిచ్చారు. ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఒకే రోజు ఒకే సారి బిడ్డలకు జన్మనివ్వడమనేది.ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

You may also like