ఆత్మహత్య చేసుకున్న 16 ఏళ్ల టిక్ టాక్ స్టార్…కారణం ఏంటి?

ఆత్మహత్య చేసుకున్న 16 ఏళ్ల టిక్ టాక్ స్టార్…కారణం ఏంటి?

by Megha Varna


జీవితం అంటే నిండు నూరేళ్లు ఎంతో ఆనందంగా బ్రతకాల్సింది పోయి కొంతమంది ఆత్మహత్య చేసుకొని మధ్యలోనే ముగించేస్తున్నారు.ఇలా ఆత్మహత్య కు పాల్పడుతున్న వారిలో ఎక్కువ శాతం యువత ఉండడం ఇప్పుడు అందరిని కలత పెడుతుంది.అయితే ప్రముఖ టిక్ టాక్ స్టార్ సియా కక్కర్ జూన్ 25 వ తారీఖున ఆత్మహత్య చేసుకొని మృతి చెందారు.సియా సిక్కర్ వయసు కేవలం 16 సంవత్సరాలు కావడం గమనించాల్సిన విషయం.సియా కక్కర్ కు సంభందించిన వివరాల్లోకి వెళితే ..

సియా సిక్కర్ ఎప్పుడూ ఆన్లైన్ లో ఉంటూ తన అభిమానులతో ముచ్చటించేవారు.సియా కక్కర్ తన డాన్స్ వీడియోలతో యూట్యూబ్,ఇంస్టాగ్రామ్,టిక్ టాక్ లో బాగా పాపులర్ అయ్యారు.సియా కక్కర్ డాన్స్ వీడియోలకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.సియా కక్కర్ కు ఇంస్టాగ్రామ్లో లక్షమందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.టిక్ టాక్ లో అయింది 1 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.సియా కక్కర్ మృతిపై చాలామంది సెలెబ్రెటీలు కూడా స్పందించారు.

సియా కక్కర్ ఆత్మ శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.ఎందుకు యువత ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.డిప్రెషన్ వలనే యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.సియా కక్కర్ మరణంపై సియా సక్కర్ మేనేజర్ స్పందిస్తూ…తన ప్రొఫెషనల్ లైఫ్ అంతా బాగుంది తాను చనిపోయే ముందు రోజు రాత్రి కూడా నేను తనతో మాట్లాడాను ఆ సమయంలో  సియా కక్కర్ కూడా బాగానే మాట్లాడారు అని అన్నారు.సియా కక్కర్ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయం ఇంకా తెలియలేదు.సియా కక్కర్ మరణంపై కేసు నమోదు చేసిన పోలీస్ లు దర్యాప్తు ప్రారంభించారు.

You may also like