Ads
అనంతపురంలో తన టిక్ టాక్ ప్రేమాయణం విఫలం అయిందని కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు.వివరాలలోకి వెళ్తే పిల్లిగుండ్లకాలనీకి చెందిన 21 ఏళ్ళ ఈడిగ ముత్యాలప్ప స్థానికంగా వాటర్ సర్వీసింగ్ బాయ్‌గా పనిచేస్తుండేవాడు.మూడు నెలల క్రితం అతనికి కర్నూలు జిల్లా డోన్ ప్రాంతంలో నివసిస్తున్న ఒక వితంతవుతో టిక్ టాక్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది.ముత్యాలప్ప తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఆమెను తన తల్లిదండ్రుల దగ్గరకు తీసుకెళ్ళాడు.
Video Advertisement
విషయం తెలుసుకున్న ముత్యాలప్ప తల్లిదండ్రులు వితంతువుతో తమ కొడుకు పెళ్లి చేయడానికి అంగీకరించలేదు.దానితో తన ప్రియురాలుతో తనకు వివాహం జరగదని గ్రహించిన ముత్యాలప్ప మనస్తాపం కు గురయ్యి
ధర్మబిక్షంకాలనీ సమీపాన గల వేపచెట్టుకు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని సర్వజనాస్పత్రికి తరలించారు.
End of Article