ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది.శ్రీవారి పాదాల చెంతకు స్వామి వారి తిరునామాలతో ఒక ఆవు దర్శనమివ్వడం అందరిని ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది.

Video Advertisement

కరోనా లాక్ డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న గోవులకు తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి రోజు ఆహారం అందిస్తుంది.దీంతో గోవులన్ని ఆకలి బాధ నుండి తప్పించుకుంటున్నాయి..ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన గోవులలో ఒక గోవు నుదిటిపై శ్రీవారి తిరునామాలు ఉండటాన్ని టిటిడి అధికారులు గుర్తించారు..

నుదిటిపై ఏడుకొండల శ్రీవెంకటేశ్వర స్వామి ధరించే తిరునామం మాదిరిగానే ఈ ఆవుకు కూడా నుదిటిపై అదే విధంగా సహజసిద్ధగా ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది..అయితే తిరునామం సహజ సిద్ధంగా పొందిన ఈ అరుదైన ఆవును టిటిడి అధికారులు గోశాలకు పంపిస్తే వచ్చిన భక్తులు వీక్షించడానికి బాగుంటుంది అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చెయ్యడంతో ,తిరునామాల గోవును తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు గోశాలకు పంపించనట్లుగా వెల్లడించారు.