Ads
ఇవాళ్టి న్యూస్ పేపర్స్ లోని తెలుగు కార్టూన్ న్యూస్.
Video Advertisement
ప్రతిరోజు న్యూస్ పేపర్లలో మనం కొన్ని కార్టూన్ వార్తలు చూస్తూ ఉంటాం. కార్టూన్ లిస్టులు ప్రత్యేకంగా ఏదో ఒక విషయం పైన కార్టూన్లు గీస్తూ న్యూస్ పేపర్ కాలంలో ప్రచురిస్తూ ఉంటారు. అయితే రాజకీయాలుగాను లేదా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన విషయాలను కార్టూన్ రూపంలో గీసి చమత్కరించేలాగా రూపొందిస్తారు. పెద్ద విషయాన్ని ఒక చిన్న కార్టూన్ రూపంలో భలే సింపుల్ గా చెప్పేస్తుంటారు.
అయితే ఇవాల్టి న్యూస్ పేపర్ లో ప్రచురించిన కార్టూన్లను ఒకసారి మనం పరిశీలిద్దాం… వాటిని వివరంగా చూస్తే…
1.
మొదటి కార్టూన్ లో కొత్త ప్రభుత్వానికి కష్ట కాలమే అంటూ కాగ్ నివేదిక అంటూ ప్రచూరించారు ఇందులో రేవంత్ రెడ్డి కార్టూన్ బొమ్మను వెయ్యగ, గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఓడిచేసి ఖాళీ గిన్నెలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంచింది అంటూ కార్టూన్ రూపంలో ఎటకారంగా ప్రచురించారు. అంటే తెలంగాణలో కొత్త ప్రభుత్వానికి అంటే తెలంగాణలో కొత్త ప్రభుత్వానికి మిగిల్చింది ఏమీ లేదు అని అర్థం వచ్చేలా దీని రూపొందించారు.
2.
ఇక రెండో కార్టూన్ విషయానికి వస్తే… రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విపక్షాల మద్దతు కోసం ఎదురుచూస్తుంది అని అర్థం వచ్చేలాగా కాంగ్రెస్ హస్తాన్ని వేసి వెనకాల మద్దతుగా నాలుగైదు చేతులు బొమ్మలను వేశారు. హస్తం నిలబడాలంటే వెనకాల ఉన్న విపక్షాల చేయపడాల్సిందే అంటూ కార్టూన్ ద్వారా తెలియజేశారు.
3.
ఇక మూడో కార్టూన్ లో కెసిఆర్ కుమార్తె కవితను ఎగతాళి చేసే విధంగా రూపొందించారు. హనుమకొండ బిఆర్ఎస్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతున్నట్టు చెప్పగా అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు పైన చాలా సందేహాలు ఉన్నాయని ఆమె చెప్పినట్లుగా రాశారు. దానికి కౌంటర్ గా అసలు మీకు కుటుంబం మీద ఉన్న సందేహంతోనే ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టారు అన్నట్టు బి.ఆర్.ఎస్ కార్యకర్త కవితతో చెబుతున్నట్లుగా చూపించారు.
4.
ఇక నాలుగో కార్టూన్ విషయానికి వస్తే ఇందులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యని చూపిస్తూ కార్టూన్ వేశారు. కర్ణాటకలో పథకాలు అమలపై మీడియా వాళ్ళు సిద్ధరామయ్యని ప్రశ్నిస్తున్నట్లు చూపించారు. గృహలక్ష్మి ఎక్కడ అంటే ఆయన సమాధానం చెప్పలేక నీళ్లు నమ్ముతున్నాడు అని రాశారు. దానికి కౌంటర్ గా గృహలక్ష్మి అంటే మీ భార్య నే కదా ఇంట్లోనే ఉందయ్యా అంటూ రాశారు.
5.
ఇక ఐదో కార్టూన్ లో ఇండియా కూటమి గురించి రాశారు. ఇండియా కూటమిలో లుకలుకలు ఒంటరిగానే వెళ్తామంటున్న మమత,కేజ్రీవాల్ అంటూ కార్టూన్ అర్థం వచ్చేలా రూపొందించారు.
6.
ఇక ఆరో కార్టున్ లో ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకొచ్చారు. కొనసాగుతున్న కార్మికుల సమ్మెను వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ లో కార్మికుల చెయ్యి ఆర్తనాదాలు పలుకుతున్నట్లు వేశారు.
End of Article