2023 లో ఎంట్రీ ఇచ్చిన 7 హీరోయిన్స్ .. ఎవరు హిట్టు..ఎవరు ఫట్టు.?

2023 లో ఎంట్రీ ఇచ్చిన 7 హీరోయిన్స్ .. ఎవరు హిట్టు..ఎవరు ఫట్టు.?

by Sainath Gopi

Ads

సినిమా ఇండస్ట్రీ లోకి పాత తరం వెనక్కి వెళ్తున్న సమయంలో కొత్త తరం నటులు వస్తూనే ఉంటారు. అలాగే 2023 సంవత్సరంలో కూడా చాలామంది హీరోయిన్లు టాలీవుడ్ లో అడుగు పెట్టారు. కొందరి ముద్దుగుమ్మల అదృష్టం బాగుండి సినిమాలు హిట్ అయితే కొందరి భామల సినిమాలు మాత్రం ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్లాయో కూడా తెలియకుండా అయిపోయింది. అలా ఈ సంవత్సరం టాలీవుడ్ లో అడుగుపెట్టిన హీరోయిన్లు ఎంతమంది సక్సెస్ అందుకున్నారు, ఎంతమంది ఫ్లాప్ మూట కట్టుకున్నారు చూద్దాం.

Video Advertisement

Samajavaragamana

ముందుగా సామజవరగమన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రెబా మౌనిక జాన్ మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది. ఆ తరువాత బూ అనే చిత్రంలో కనిపించింది. బూ సినిమా పెద్దగా హిట్ కానప్పటికీ సామజవరగమన సినిమా ఎఫెక్ట్ వల్ల ప్రస్తుతం ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది.

అలాగే బెల్లంకొండ సురేష్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ కలిసి నేను స్టూడెంట్ సార్ అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన భామ అవంతిక దాసాని. అయితే ఈ సినిమా ఫ్లాప్ ని మూట కట్టుకోవడంతో హీరోయిన్ పేరు కూడా చాలామందికి తెలియకుండా పోయింది.

agent movie review

ఏజెంట్ సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగు పెట్టిన సాక్షి వైద్య ఆపై గాండీవధారి అర్జున, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈ భామ పర్వాలేదనిపించుకుంది. అలాగే మాస్ మహారాజా రవితేజ సరసన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నుపుర్ సనన్. ఈ సినిమా ఫ్లాప్ ని మూట కట్టుకోవడంతో టాలీవుడ్ ని వదిలి వెళ్ళిపోయింది.

అలాగే అమిగోస్ సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టింది ఆషిక రంగనాథ్. ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ ని మూటగట్టుకుంది అయినప్పటికీ నాగార్జున సరసన నా సామిరంగా సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ భామ.

అలాగే వీళ్ళతోపాటు రంగవల్లి సినిమాతో యుక్తి తరేగా, మేము ఫేమస్ సినిమాతో సారయ లక్ష్మణ్, అహింస సినిమాతో గీతిక తివారి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఎవరూ చెప్పుకోదగిన సక్సెస్ ని అందుకోలేకపోవడం విచారకరం.


End of Article

You may also like