Ads
సాధారణంగా హీరోయిన్లు అంటే అందంగా, గ్లామర్ గా ఉండాలి. అయితే హీరోయిన్స్ వారి అందాన్ని కాపాడుకుంటేనే అవకాశాలు వస్తాయి. వారు కొంచెం ఎక్కువగా తిన్నా, తినడం తగ్గించినా ఇబ్బందే. హీరోయిన్స్ కాస్త బరువు పెరిగినా కూడా సమస్యే. అయితే కొంత మంది హీరోయిన్లు తమ సినిమాల కోసం లేదా వారు చేసే క్యారెక్టర్స్ కోసం బరువు తగ్గడం కానీ, పెరగడం కానీ చేస్తుంటారు.
Video Advertisement
కొందరు హీరోయిన్లకి ఆఫర్స్ ఉన్న, లేకపోయినా తీసుకునే ఆహారాన్ని బట్టి, ఆరోగ్య సమస్యల కారణంగా కొంచెం బరువు పెరగుతూ ఉంటారు. దక్షణాది హీరోయిన్లలో కొందరు లావు అవ్వడం లేదా చాలా సన్నగా కావడం జరిగింది. అయితే వారి పై బాడీ షేమింగ్ ట్రోల్స్ వచ్చాయి. ఇలా హీరోయిన్స్ సన్నగా లేదా లావుగా అయినపుడు ఫ్యాన్స్, నెటిజెన్స్ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. అలా బాడీ షేమింగ్ ట్రోల్స్ కి గురైన హీరోయిన్స్ ఎవరి ఇప్పుడు చూద్దాం.. 1.ఇలియానా:
పోకిరి, జల్సా వంటి హిట్స్ తో స్టార్ హీరోయిన్ గా మారిన ఇలియానా, బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది. ఆ తరువాత రవితేజ ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ మూవీతో తెలుగులోకి మళ్ళీ వచ్చింది. ఆ సమయంలో ఇలియానా చాలా బరువు పెరగడంతో ఆమె ఫోటోలు వైరల్ అయ్యాయి. సన్నగా అందంగా ఉండే ఇలియానా ఇంత లావు అయింది ఏంటి అంటూ నెటిజన్స్ ట్రోల్ చేసారు.2.అనుష్క శెట్టి:
హీరోయిన్ అనుష్క శెట్టికి బాడీ షేమింగ్ ట్రోల్స్ కొట్టా కాదు. మిర్చి, బాహుబలి చిత్రాల నుండి వస్తున్నాయి. అయితే ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో నటిస్తున్న మూవీ లుక్ బయటకి రావడంతో ఆమె బరువు పెరగడం పై మీద అభిమానులు కామెంట్స్ చేసారు.3.రక్షిత:
ఇడియట్, నిజం, పెళ్ళాం ఊరెళ్ళితే, ఆంధ్రావాలా వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించిన రక్షిత. పెళ్లి తరువాత సినిమాలకు దూరమ అయ్యింది. ఆ తరువాత ఆమె బరువు పెరగడంతో సోషల్ మీడియాలో రక్షితను చాలా ట్రోల్ చేశారు.
4.నిత్య మీనన్:
హీరోయిన్ నిత్య మీనన్ ఆ మధ్య చాలా బరువు పెరిగింది. హిందీ మూవీ ప్రమోషన్స్ లో ఆమె వేసుకున్నడ్రెస్ పై, బరువు పెరగడం పై సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ చాలా ట్రోల్ చేసారు.
5.నమిత:
సొంతం, జెమినీ సినిమాలలో తన అందంతో టాలీవుడ్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న నమిత ఆ తరువాత కోలీవుడ్ కి వెళ్ళిపోయింది. చాలా ఏళ్ల తరువాత ప్రభాస్ బిల్లా మూవీలో నటించింది. ఈ సినిమాలో నమితను చూసి ట్రోల్ చేసారు. ఆ మూవీ తరువాత కూడా ఆమెని ట్రోల్ చేశారు.6.నివేత థామస్:
నిన్ను కోరి, వకీల్ సాబ్, జై లవ కుశ వంటి చిత్రాలలో నటించిన నివేత థామస్ టాలీవుడ్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమధ్య విడుదలయిన ‘శాకినీ డాకిని’ మూవీలో ఆమె లావుగా కనిపించడంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్ చేశారు. 7.పూనమ్ బజ్వా:
మొదటి సినిమా, నాగార్జున నటించిన బాస్ చిత్రాలలో నటించిన పూనమ్ బజ్వా ఆ తరువాత తెలుగులో ఆఫర్స్ రాకపోవడంతో కోలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడ బోల్డ్ చిత్రాలలో నటిస్తున్న పూనమ్ మీద తమిళ, తెలుగు ఆడియన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు .8.రకుల్ ప్రీత్:
హీరోయిన్లు బరువు పెరగడం వల్ల బాడీ షేమింగ్ కి గురైతే, రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం సన్నగా అయినందుకు ట్రోల్స్ ఎదుర్కొంటోంది. ఫిట్నెస్ మీద ఆసక్తితో 20 కేజీలకు పైగా తగ్గి, జీరో సైజులా మారింది. ఇది ఆమె అభిమనులతో పాటుగా ఆడియెన్స్ కి కూడా నచ్చలేదు. దాంతో కట్టె పుల్లెమాదిరిగా అయ్యిందని, తినట్లేదా అని ట్రోల్ చేసారు. Also Read:దసరా “శ్రీకాంత్ ఓదెల” తో పాటు… ఇండస్ట్రీకి “నాని” పరిచయం చేసిన 10 డైరెక్టర్స్..!
End of Article