ఆ సర్వే ప్రకారం టాప్ తెలుగు 10 హీరోలు వీరే…ఏ హీరో ఏ స్థానంలో అంటే?

ఆ సర్వే ప్రకారం టాప్ తెలుగు 10 హీరోలు వీరే…ఏ హీరో ఏ స్థానంలో అంటే?

by Megha Varna

Ads

కరోనా దెబ్బ సామాన్యుల నుండి సెలబ్రిటీలు వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.తాజాగా ఇచ్చిన మినహాయింపులతో కొన్ని చిన్న చిత్రాల షూటింగ్ స్టార్ట్ అయినప్పటికీ అవి కొద్దిరోజులకే ఆగిపోయాయి.ప్రస్తుతం కరోనా ఉధృతి ఎప్పుడు తగ్గుతుందా అని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.ఇలాంటి టైంలో ఆర్మాక్స్ మీడియా జూన్ నెలలో టాలీవుడ్ పాపులర్ 10 హీరో లిస్ట్ ను విడుదల చేసింది.ఆ లిస్ట్ లో ఉన్న హీరోస్ ను ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

మహేష్ బాబు : ఈ సంవత్సరం మొదట్లో “సరిలేరు నీకెవ్వరు” చిత్రంతో మరో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు.

అల్లు అర్జున్ : మహేష్ బాబు తో సంక్రాంతి బరిలో దిగిన బన్నీ అల వైకుంఠపురములో చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.ప్రస్తుతం బన్నీ తన మిత్రుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రంలో బిజీగా ఉన్నాడు.

ప్రభాస్ : బాహుబలి చిత్రంతో భారతదేశమంతా ఫ్యాన్స్ ను సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ చిత్రం చేస్తున్నాడు.ఈ చిత్ర రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ : రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్ ఇప్పుడు పింక్ రీమేక్ లో నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ అయిన పాట మార్కెట్ లో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

చిరంజీవి : సైరా నరసింహా రెడ్డి చిత్రంతో సూపర్ హిట్ ను అందుకున్న మెగా స్టార్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రం చేస్తున్నాడు.ఇందులో ఆయనకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.

ఎన్టీఆర్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చరణ్ తో కలిసి ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్నాడు.కరోనా పూర్తయ్యాక ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానున్నది.

నాని: నాచురల్ స్టార్ నాని సుధీర్ తో కలిసి నటించిన v చిత్రం కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.మొదట ఈ చిత్రం ఓటిటి ప్లాట్ ఫారం లో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుందని ప్రచారం జరిగింది. కాని దీన్ని చిత్ర టీం తోసిపుచ్చింది.

రామ్ చరణ్ : ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో చేస్తున్నాడు.అలాగే ఆచార్య చిత్రంలో ఓ స్పెషల్ రోల్ చేస్తున్నాడు.

విజయ దేవరకొండ : అర్జున్ రెడ్డి చిత్రంతో మనోడు బాగా ఫేమస్ అయిపోయాడు.ప్రస్తుతం విజయ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు.

వెంకటేష్ : ఫ్యామిలీ హీరోగా పేరున్న వెంకటేష్ చాలా గ్యాప్ తరువాత నారప్ప చిత్రం చేస్తున్నాడు.ఈ చిత్రం తమిళ్ లో సూపర్ హిట్ అయిన అసురన్ రీమేక్..ఇందులో వెంకటేష్ కు జోడిగా ప్రియమణి నటిస్తుంది.


End of Article

You may also like