ఆ సర్వే ప్రకారం టాప్ 10 హీరోయిన్స్ వీరే… 1 వ స్థానంలో ఎవరంటే?

ఆ సర్వే ప్రకారం టాప్ 10 హీరోయిన్స్ వీరే… 1 వ స్థానంలో ఎవరంటే?

by Megha Varna

Ads

కరోనా దెబ్బ సామాన్యుల నుండి సెలబ్రిటీలు వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.తాజాగా ఇచ్చిన మినహాయింపులతో కొన్ని చిన్న చిత్రాల షూటింగ్ స్టార్ట్ అయినప్పటికీ అవి కొద్దిరోజులకే ఆగిపోయాయి.ప్రస్తుతం కరోనా ఉధృతి ఎప్పుడు తగ్గుతుందా అని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Video Advertisement

ఆర్మాక్స్ మీడియా జూన్ నెలలో టాలీవుడ్ పాపులర్ 10 హీరోయిన్ లిస్ట్ ను విడుదల చేసింది.ఆ లిస్ట్ లో ఉన్న హీరోయిన్స్ ను ఇప్పుడు చూద్దాం.

#1. సమంత :

పెళ్లి తరువాత వరుస సినిమాలు చేస్తూ కొత్తగా వస్తున్న హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇస్తున్న అక్కినేని కోడలు సమంత ఈ లిస్ట్ లో టాప్ స్ధానంలో నిలిచింది.

#2. అనుష్క :

గత దశాబ్ద కాలం నుండి టాలీవుడ్ లో తన హవాను కొనసాగిస్తున్న స్టార్ హీరోయిన్స్ లో అనుష్క ఒకరు.తనతో నటించిన హీరోయిన్స్ అంతా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడానికి సిద్ధపడుతున్న మన స్వీటీ మాత్రం ఇప్పటికీ మెయిన్ లీడ్ పాత్రలు చేస్తూ అభిమానులను ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తున్నారు.అందుకే ఈ లిస్ట్ ఆమె రెండవ స్థానంలో నిలిచారు.

#3. కాజల్ :

ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతమంది కుర్రకారుకు డ్రీమ్ గర్ల్ గా ఉన్న కాజల్ ప్రస్తుతానికి మెగా స్టార్ తో ఆచార్య సినిమాలో రెండవసారి జత కట్టింది.

#4. రష్మిక మందాన :

అతి తక్కువ కాలంలోనే సూపర్ స్టార్ గా మారిన రష్మిక మందాన. ప్రస్తుతం తెలుగులో నాన్ స్టాప్ గా ఆఫర్లు కొట్టేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఈ లిస్ట్ లో నాలుగవ స్థానంలో నిలిచింది.

#5. తమన్నా :

టాలీవుడ్ కోలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దాదాపు దశాబ్ద కాలం పాటు ఫుల్ బిజీగా ఉన్న మిల్కీ బ్యూటీ ప్రస్తుతం ఆఫర్స్ తగ్గిపోవడంతో అడపాదడపా సినిమాల్లో తళుక్కుమని మెరుస్తుంది.

#6. రకుల్ ప్రీత్ సింగ్ :

ఈ ముద్దుగుమ్మను అందరూ ఫిట్నెస్ ఫ్రీక్ అని పిలుస్తుంటారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

#7. పూజ హెగ్డే :

ఈ సంవత్సరం మొదట్లో “అల వైకుంఠపురంలో” చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న పూజ. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ తో కలిసి “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్” చిత్రంలో నటిస్తుంది.

#8. నయనతార :

గత సంవత్సరం చిరంజీవితో నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంతో సూపర్ హిట్ ను అందుకున్న నయనతార ప్రస్తుతం ఫ్యామిలీ తో టైం గడపుతున్నారు.ఈమధ్య ఈమె పెళ్లి చేసుకోబోతోందని రూమర్స్ వినిపిస్తున్నాయి.ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.

#9. కీర్తి సురేష్ :

మహానటి చిత్రంతో ఈమె బాగా బిజీ అయిపోయింది. రీసెంట్ గా ఈమె పెంగ్విన్ చిత్రంతో సూపర్ హిట్ ను అందుకుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ చేసిన నటన అందరినీ ఆకట్టుకుంది.

#10. త్రిష :

తెలుగులో చాలా కాలం పాటు తన హవా కొనసాగించిన త్రిష ప్రస్తుతం అవకాశాలు లేక అడపదడప కనిపిస్తుంది. అందుకే ఆమె ఈ లిస్ట్ లో ఫైనల్ ప్లేసులో నిలిచింది.


End of Article

You may also like