Ads
చిలుకూరు వెంకటేశ్వర స్వామి గుడి తెలియనివాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. వారంలో ఏడు రోజులు చిలుకూరు రద్దీగానే ఉంటుంది. ఇంకా శనివారం ఆదివారం అయితే ఇసకేస్తే రాలనంత మంది జనం ఉంటారు. చాలామంది తమ మనసులో కోరికను చెప్పి 11 ప్రదక్షిణాలు చేస్తారు. అవి తీరిన తర్వాత మళ్ళీ వచ్చి 108 ప్రదక్షిణాలు చేసి స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు.
Video Advertisement
ఒకవేళ విదేశాలకు వెళ్లాలని ఉంటే, ఎన్నిసార్లు ప్రయత్నించినా వీసా రాకపోతే, చిలుకూరు వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి 11 ప్రదక్షిణాలు చేసి వీసా రావాలి అని మొక్కుకుంటే కచ్చితంగా వాళ్ళ కోరిక నెరవేరుతుంది అట. అందుకే చిలుకూరు వెంకటేశ్వర స్వామి ని వీసా గాడ్ అని చిలుకూరు గుడిని వీసా టెంపుల్ అని పిలుస్తారు.
ఎంతో మహత్వం గల చిలుకూరు వెంకటేశ్వర స్వామి గుడిలో ఇవాళ ఒక అద్భుతం జరిగింది. ఇవాళ తెల్లవారు జామున చిలుకూరు లో ఉన్న శివుడి మందిరం లోకి ఒక తాబేలు ప్రవేశించింది. తాబేలు దాదాపు 10 సెంటి మీటర్ల పొడవు 6 సెంటీమీటర్లు వెడల్పు ఉంది. తాబేలు లోపలికి ఎలా వచ్చింది అనే విషయం ఎవరికీ తెలీదు.
చిలుకూరు వెంకటేశ్వర స్వామి గుడి యొక్క ప్రధాన అర్చకులు రంగరాజన్ మాట్లాడుతూ ” ఇలా కూర్మ మూర్తి దర్శనం అవ్వడం శుభసూచకం. క్షీర సాగర మధనం జరిగినప్పుడు మేరు పర్వతాన్ని కూర్మావతారం పైనుంచి వాసుకి అనే సర్పం తో ఒకవైపు అసురులు ఒకవైపు దేవతలు మదించారు.
మధనంలో హాలాహలం వచ్చినప్పుడు పరమశివుడు దానిని మింగుతాడు. అలాగే చిలుకూరులో సుందరేశ్వర స్వామి గుడిలో కూర్మం ప్రత్యక్షమవడం అంటే ఆ వెంకటేశ్వరస్వామి మనకి త్వరలోనే కరోనా వైరస్ అంతమవుతుంది అని సూచిస్తున్నారు అని అర్థం. ఎంతో మంది భక్తుల ప్రార్ధనలు, ఎందరో డాక్టర్ల ప్రయత్నాలు త్వరలోనే ఫలిస్తాయి” అని అన్నారు.
watch video:
End of Article