Ads
మలయాళం సినిమాలు అంటే సహజంగా ఉంటాయి అని, అందులోనూ మంచి కంటెంట్ ఉంటుంది అని చాలా గుర్తింపు ఉంది. సాధారణంగా తెలుగులో తమిళ్ సినిమాలు మాత్రమే ఎక్కువగా విడుదల అవుతాయి. కానీ ఈ మధ్యకాలంలో మలయాళం సినిమాలు కూడా తెలుగులో చాలా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాయి. ఇదే విధంగా ఇప్పుడు మలయాళంలో సూపర్ హిట్ అయిన 2018 సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు డబ్బింగ్ రూపంలో వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : 2018
- నటీనటులు : టోవినో థామస్, తన్వి రామ్, కుంచకో బోబన్.
- నిర్మాత : వేణు కున్నప్పిల్లి, సీకే పద్మకుమార్, ఆంటో జోసెఫ్
- దర్శకత్వం : జూడ్ ఆంథనీ జోసెఫ్
- సంగీతం : నోబిన్ పాల్
- విడుదల తేదీ : మే 26, 2023
స్టోరీ :
అనూప్ (టోవినో థామస్) ఆర్మీలో ఉద్యోగం చేసేవాడు. ఆ తర్వాత ఉద్యోగం మానేసి దుబాయ్ వెళ్లాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. నిక్సన్ (అసిఫ్ అలీ) ఒక మత్స్యకారి కుటుంబానికి చెందిన వాడు. పెద్ద మోడల్ అవ్వాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. కోషి (అజు వర్గీస్) అనే ఒక టాక్సీ డ్రైవర్. తన మీదే తన కుటుంబం అంతా నడుస్తూ ఉంటుంది. కేరళ సరిహద్దుల్లో ఉండే తమిళనాడులోని ఒక గ్రామానికి చెందిన సేతు (కలైయారసన్) ఒక లారీ డ్రైవర్.
ఒక ప్రభుత్వ కార్యాలయంలో పని చేసే అధికారి (కుంచకో బోబన్). ఎవరి జీవితాలు వాళ్లు గడుపుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో కేరళని భారీ వర్షాలతో వచ్చిన వరదలు ముంచెత్తుతాయి. దీని వల్ల అప్పటి వరకు సాఫీగా సాగుతున్న వారి జీవితంలో ఆటుపోట్లు ఎదురవుతాయి. ఈ వరదల వల్ల వాళ్లు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఎలాంటి సమస్యలు వచ్చాయి? ఆ సమస్యలను వారు ఎలా పరిష్కరించారు? తర్వాత వారు ఏమయ్యారు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
మలయాళం డబ్బింగ్ సినిమాలతో తెలుగులో గుర్తింపు సంపాదించుకున్న నటుడు టోవినో థామస్. డైరెక్ట్ థియేటర్ లో కాకపోయినా ఓటీటీలో టోవినో థామస్ సినిమాలకి చాలా గుర్తింపు ఉంది. ఈ సినిమా కొంత కాలం క్రితం మలయాళంలో విడుదల అయ్యింది. అప్పుడే చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఇదే సినిమాని తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు.
సినిమా అంతా కూడా దాదాపు 100 సంవత్సరాల కిందటి ప్రాంతంలో వచ్చిన వరదల వల్ల కొంత మంది ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనే విషయం చుట్టూ తిరుగుతుంది. స్టోరీ పాయింట్ సింపుల్ గానే ఉంటుంది. కానీ దర్శకుడు ఆ పాయింట్ చుట్టూ రాసుకున్న కథ చాలా బాగుంది. సినిమా కొంత భాగం పాత్రలని పరిచయం చేయడంతోనే అయిపోతుంది. అసలు దర్శకుడు ఏం చేస్తున్నాడు అనుకునే సమయంలో అసలు పాయింట్ ని తీసుకొచ్చాడు.
కానీ ఒక్కసారి సినిమా పాయింట్ వచ్చాక వేరే ఎటు డైవర్ట్ అవ్వకుండా, చివరి వరకు ఈ విషయం మీదే నడుస్తుంది. సస్పెన్స్ తో పాటు ఎమోషన్ ని కూడా డైరెక్టర్ తెరపై చాలా బాగా చూపించారు. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. ఈ సినిమాకి అంత మంది నటీనటులు కూడా అవసరమే. అయితే సినిమా చూస్తున్నంత సేపు సాధారణంగా కొంత మంది మనుషులు వరదలో చిక్కుకుంటే ఇలాగే ఉంటుంది ఏమో అని ప్రేక్షకులు ఫీల్ అవుతారు.
వారి ఎమోషన్ ని ప్రేక్షకుల వరకు తీసుకెళ్లగలిగారు అంటే వారు ఎంత బాగా నటించారు అనేది అర్థం అయిపోతోంది. ఆకాశమే నీ హద్దురా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిన అపర్ణ బాలమురళి కూడా ఇందులో నటించారు. కానీ ఈ సినిమా చూస్తున్నంతసేపు ఆ సినిమాలో నటించిన నటి తనే అన్న విషయం మర్చిపోతాం. అలాగే అంటే సుందరానికి సినిమాలో హీరోయిన్ అక్కగా నటించిన తన్వి కూడా ఇందులో నటించారు.
అలాగే టెక్నికల్ గా కూడా సినిమా చాలా బాగుంది. కెమెరా పనితనం సినిమాకి అతిపెద్ద హైలైట్. ఆ తర్వాత ఈ సినిమాకి మరొక ప్లస్ పాయింట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. సినిమాకి పెద్ద బలం సెకండ్ హాఫ్. అందులో వచ్చే ఎమోషన్స్. కానీ ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ మాత్రం సెకండ్ హాఫ్ తో పోలిస్తే అంత గొప్పగా అనిపించవు. అందుకే ఫస్ట్ హాఫ్ విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటుల పర్ఫార్మెన్స్
- స్టోరీ పాయింట్
- నిర్మాణ విలువలు
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్:
- ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్
- సాగదీసినట్టుగా అనిపించే కొన్ని ఎపిసోడ్స్
రేటింగ్ :
3.5/5
ట్యాగ్ లైన్ :
మలయాళంలో ఈ సినిమా ఇప్పటికే చాలా పెద్ద హిట్ అయ్యింది. కంటెంట్ పరంగా కొత్తదనం కోరుకునే వారికి, అలాగే ఎమోషనల్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పక చూడగలిగే సినిమా. ఇటీవల కాలంలో వచ్చిన మంచి ఎమోషనల్ సినిమాల్లో ఒకటిగా 2018 సినిమా నిలుస్తుంది.
watch trailer :
End of Article