ఫుట్‌పాత్‌ పైనుంచి వస్తున్న బైకర్లకు…ఈ పెద్దావిడ ఎలా బుద్ది చెప్పిందో చూడండి (వీడియో )

ఫుట్‌పాత్‌ పైనుంచి వస్తున్న బైకర్లకు…ఈ పెద్దావిడ ఎలా బుద్ది చెప్పిందో చూడండి (వీడియో )

by Megha Varna

Ads

ట్రాఫిక్ సిగ్నల్ పడినా, వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నా వెంటనే బైక్ పై వెళ్లేవారికి ఫుట్ పాత్ గుర్తుకు వస్తుంది. ఎలాగైనా సులువుగా ముందుకు వెళ్లిపోవాలని దానిపై నుంచి రయ్ మంటూ దూసుకెళ్తుంటారు. పాదచారుల కోసం కట్టిన ఆ ఫుట్ పాత్ కాస్త బైకులు వెళ్లేందుకు దారిలా మారుతుంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే ఫుట్పైనే పండ్లూ, హోటళ్లు నిర్వహిస్తుంటారు. ద్విచక్ర వాహనదారులు షార్ట్‌కట్‌గా ఫుట్‌పాత్‌పై నుంచి బక్‌ పోనిస్తున్నారు. దీంతో బాటసారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. పుణె నగరం కూడా దీనికి మినహాయింపు కాదు. ఈనేపథ్యంలో నగరానికి చెందిన  ఓ మహిళ బైకర్లకు చుక్కలు చూపించింది.

Video Advertisement

ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకుండా ఫుట్‌పాత్‌ పైనుంచి వస్తున్న బైకర్లను అడ్డుకుని.. చీవాట్లు పెట్టారు. ఆమె ‘క్లాస్‌’కు భయపడ్డ బైకర్లు ఫుట్‌పాత్‌ పైనుంచి వచ్చేందుకు వెనకడుగు వేశారు.సిగ్నల్ పడిన వెంటనే బైక్‌పై వచ్చే వాళ్లు ఫుట్‌పాత్ ఎక్కితే దమ్ముంటే నన్ను ఢీకొట్టి ముందుకు వెళ్లు అని ముఖం మీదే చెప్పడం ప్రారంభించింది. ఆ పెద్దావిడ మాటలు విని సిగ్గుతో టూవీలర్ పై వచ్చే వారు మార్చుకుంటూ తిరిగి రోడ్డు మార్గం ద్వారా వెళ్లడం ప్రారంభించారు. అలా వచ్చిన ప్రతి ఒక్కరిని తరమడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ పెద్దావిడ చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు చాలా మంచి పని చేశారు మేడం అంటూ కొంత మందిఫుట్‌పాత్‌లపై ప్రయాణించే బైకర్లకు సిగ్గుపడాలంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వీడియో చుసిన పూణే పోలీస్ అధికారులు ఇలాంటివి జరగకుండా చేసుకుంటాము వెల్లడించారు .


End of Article

You may also like