గోదావరి జిల్లాల వారికి గుడ్ న్యూస్.. అయోధ్యకు డైరెక్ట్ ట్రైన్!

గోదావరి జిల్లాల వారికి గుడ్ న్యూస్.. అయోధ్యకు డైరెక్ట్ ట్రైన్!

by Harika

500 సంవత్సరాల తరువాత అంగరంగ వైభవంగా అయోధ్య రాముడు సొంత గడ్డపై కొలువుతీరాడు. సుకుమార సుందర రూపుడైనా రామ్ లల్లా ను దర్శించేందుకు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల నుంచి సైతం భక్తులు తరలివస్తున్నారు. దీనివలన రైళ్లలో రద్దీ పెరగటం చూసిన రైల్వే అధికారులు ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల నుంచి నేరుగా అయోధ్యకు రైలు ఏర్పాటు చేశారు. అయోధ్యకు వెళ్లి రాముల వారి దర్శనం చేసుకొని మరల తిరిగి అదే రైల్లో వారి స్వగ్రామాలకు వచ్చే విధంగా ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది రైల్వే శాఖ.

Video Advertisement

రాజమండ్రి,సామర్లకోట,తుని స్టేషన్ల నుంచి కాశీ పుణ్యక్షేత్రానికి వెళ్లాలనుకునే వారు ఇక రైళ్లు మారవలసిన అవసరం లేదు. గతంలో రాజమండ్రి నుంచి విశాఖకు ఒక రైలు, అక్కడి నుంచి భువనేశ్వర్ వరకు మరొక రైలు, అక్కడ నుంచి కాశీ లేదంటే అయోధ్యకు వెళ్లడానికి మరొక రైలు ఎక్కాల్సి వచ్చేది. ఇకమీదట అలాంటి ఇబ్బంది ప్రజలకు ఉండదు . ఎందుకంటే 07218 నెంబర్ తో ఈ నెల 11 నుంచి సామర్లకోట నుంచి అయోధ్య కి వెళ్లటానికి డైరెక్ట్ రైలు ఏర్పాటు చేశారు తిరిగి 14వ తేదీన అయోధ్యలో తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.

అలాగే గుంటూరు నుంచి మరొక రైలు రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి మీదుగా ప్రయాణించనుంది. ఏడవ తేదీన గుంటూరులో ప్రారంభమై అయోధ్యకు చేరుతుంది. తిరిగి పదవ తేదీన అయోధ్య నుంచి గుంటూరు కి చేరుతుంది. రైల్వే అధికారులు చేసిన ఈ ఏర్పాటుకు ఉభయగోదావరి జిల్లా వాసులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

రెండు మూడు మైళ్ళు మారి వెళ్లవలసిన పని లేకుండా నేరుగా ఉమ్మడి జిల్లాల నుంచే ప్రత్యేక రైలు అందుబాటులో ఉండటంతో పెద్ద ఎత్తున రామ భక్తులు దర్శనం చేసుకుంటారని భావిస్తున్నారు రైల్వే శాఖ. అయితే నిజంగానే ఈ అవకాశాన్ని ఎలాగైనా ఉపయోగించుకుంటామని, రిజర్వేషన్ లేకపోయినప్పటికీ సాధారణమైన ప్రయాణం చేసైనా సరే సుందర రాముడిని దర్శించుకుంటాం అని చెప్తున్నారు ఉభయ గోదావరి జిల్లా వాసులు.


You may also like

Leave a Comment