Ads
సాధారణంగా రియాల్టీకి కొంచెం దూరంలో ఉన్న వాటిని సోషియో ఫాంటసీ సినిమాలు అంటారు. కానీ కమర్షియల్ సినిమాల్లో కూడా కొన్ని సీన్స్ రియాలిటీకే కాదు, సైన్స్ కి కూడా చాలా దూరంగా ఉంటాయి. అలాంటి కొన్ని సీన్స్ ఇవే.
Video Advertisement
#1 వినయ విధేయ రామ
ఈ సినిమాలో రామ్ చరణ్ తన అన్న ప్రాబ్లంలో ఉన్నామని కాల్ చేసి చెప్పగానే, ఎయిర్ పోర్ట్ లో ఉన్న గ్లాస్ విండో నుంచి బయటికి దూకి, ఒక బ్రిడ్జి దగ్గరికెళ్లి కింద వెళ్తున్న ట్రైన్ మీద ఎక్కి తన అన్న దగ్గరికి వెళ్తారు.
#2 ఆగడు
ఈ సినిమాలో మహేష్ బాబు నడుస్తున్న ట్రైన్ బోగీల మధ్యలో నుండి దూకుతారు.
#3 పల్నాటి బ్రహ్మ నాయుడు
ఈ సినిమాలో విలన్స్ ఒక ట్రైన్లో వెళుతూ ఉంటే బాలకృష్ణ ఇంకొక ట్రైన్ పై నించొని ఎదురుగా వస్తారు.
#4 ఇద్దరు మిత్రులు
ఇందులో చిరంజీవి, రైల్వే ట్రాక్ పై కార్ లో ఇరుక్కుపోయిన సురేష్ ని కాపాడి, ట్రైన్ దగ్గరికి రాకుండా వేగంగా పరిగెడతారు.
https://www.youtube.com/watch?v=ufOpjK-iErE
#5 బొబ్బిలి రాజా
ఇందులో ట్రైన్ మీద ఫైటింగ్ జరుగుతుంది.
#6 రోబో
ఈ సినిమాలో రోబో పాత్రలో ఉన్న రజినీకాంత్ గారు, ఒక ట్రైన్ మీద నుంచి మరొక ట్రైన్ మీదకి దూకుతారు. కానీ రోబో అని మెన్షన్ చేశారు కాబట్టి అందరికీ మామూలుగానే అనిపించింది.
https://www.youtube.com/watch?v=h5cz465mGOQ
#7 కిక్
రవితేజ హీరోగా వచ్చిన కిక్ సినిమాని హిందీలో అదే పేరుతో సల్మాన్ ఖాన్ హీరోగా రీమేక్ చేశారు. ఇందులో ఒక సీన్ లో సల్మాన్ ఖాన్ రైల్వే ట్రాక్ వరకు సైకిల్ మీద వచ్చి, సైకిల్ ముందుకి పడేసి, ట్రైన్ ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తారు.
#8 విజయేంద్ర వర్మ
ఈ సినిమాలో హీరో బైక్ తో ట్రైన్ మీదకి ఎక్కుతారు.
#9 ఇంద్ర
ఈ సినిమాలో హీరో మేనకోడలిని, అలాగే కొంతమందిని కిడ్నాప్ చేసి ట్రైన్ లో తీసుకెళ్తుంటారు. హీరో హెలికాఫ్టర్లో తన వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు. హీరోని ట్రైన్లో నుండి చూసిన మేనకోడలు డోర్ దగ్గరికి వెళ్లి అరచి హీరోని పిలుస్తుంది. అప్పుడు హీరో కూడా వాళ్ళు చూస్తారు.
#10 కూలి నెంబర్ 1
వరుణ్ ధావన్ హీరోగా నటించిన కూలి నెంబర్ 1 సినిమా ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఇందులో ఒక బాబు రైల్వే ట్రాక్ మీద ఆడుకుంటూ ఉంటే, వెనకాల నుండి ట్రైన్ వస్తూ ఉంటుంది. అప్పుడు హీరో ట్రైన్ మీదకి దూకి వేగంగా పరిగెత్తి ఆ బాబుని కాపాడుతాడు.
https://youtu.be/75YEoxN7jWI
End of Article