Ads
భారతీయ రైల్వే ప్రయాణికులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. రైల్లో ప్రయాణించే వారు నిర్ణయించిన ఉచిత బరువు పరిమితికి మించి సామాను తీసుకెళ్తే అదనపు రుసుములు చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్లో వెల్లడించారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యం దృష్ట్యా ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Video Advertisement

ప్రస్తుత రైల్వే నిబంధనల ప్రకారం, ప్రతి ప్రయాణికుడికి టికెట్ తరగతిని బట్టి ఒక నిర్దిష్ట బరువు వరకు సామాను ఉచితంగా తీసుకెళ్లే అవకాశం ఉంది. జనరల్ లేదా సెకండ్ క్లాస్లో ప్రయాణించే వారు 35 కిలోల వరకు, స్లీపర్ క్లాస్ ప్రయాణికులు 40 కిలోల వరకు సామాను ఉచితంగా తీసుకెళ్లవచ్చు. అదే విధంగా ఏసీ 3 టియర్, ఏసీ చెయిర్ కార్ ప్రయాణికులకు 40 కిలోలు, ఏసీ 2 టియర్ మరియు ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు 50 కిలోలు, ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు 70 కిలోల వరకు అనుమతి ఉంటుంది.

ఈ ఉచిత పరిమితిని మించి కానీ రైల్వే అనుమతించిన గరిష్ట బరువు లోపల సామాను తీసుకెళ్లాలంటే అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుములు సాధారణ లగేజ్ చార్జీల కంటే ఎక్కువగా వసూలు చేస్తారని రైల్వే అధికారులు తెలిపారు.రైళ్లలో అధిక సామాను కారణంగా బోగీల్లో రద్దీ పెరగడం, ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలగడం వంటి సమస్యలను తగ్గించడమే ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశమని రైల్వే శాఖ పేర్కొంది. 
పెద్ద పరిమాణంలో ఉన్న లేదా వాణిజ్య వస్తువులుగా భావించే సామానును ప్రయాణికుల బోగీల్లో అనుమతించరు. అటువంటి సామానును పార్సల్ వాన్ లేదా బ్రేక్ వాన్ ద్వారా బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.రైలు ప్రయాణానికి ముందు తమ సామాను బరువు, పరిమాణాన్ని పరిశీలించుకుని నిబంధనల ప్రకారం సిద్ధం కావాలని రైల్వే అధికారులు ప్రయాణికులకు సూచిస్తున్నారు.
End of Article
