Ads
టెక్నాలజీ ఎప్పటికప్పుడు డెవలప్ అవుతూనే ఉంది. దాంతో మనుషులు కూడా చిన్న పనుల నుండి పెద్ద పనుల వరకు సులభంగా చేయగలుగుతున్నారు. సాధారణంగా అంతకుముందు టెక్స్ట్ మెసేజెస్ తక్కువే. ఇప్పుడు చాలా మంది ఫోన్ మాట్లాడటం కంటే మెసేజ్ చేయడమే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ముందు టెక్స్ట్ మెసేజెస్ అంటే ఫోన్ నుండి ఎటువంటి అప్లికేషన్ సహాయం లేకుండా డైరెక్ట్ ఎస్ఎంఎస్ పంపడం మాత్రమే ఉండేవి.
Video Advertisement
మనం దేనికైనా రియాక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు, లేదా దేనికైనా జవాబు ఇవ్వాలి అనుకున్నప్పుడు పెద్ద పెద్ద మెసేజెస్ పంపించకుండా, ఒక్క ఎమోజి పంపిస్తే చాలు.ఆ ఎమోజి ద్వారా మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అవతల వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. ఫోన్ లో సందర్భానికి సూటయ్యే లాగా కొన్ని వందల ఎమోజీలు ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి ఇంకొక కొత్త ఎమోజి కూడా చేరింది. అదే జుట్టు ఉన్న ఎమోజి. ప్రస్తుతం ఈ ఎమోజి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇలా జుట్టు ఉన్న ఎమోజి రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
గూగుల్ లో ట్రెండింగ్ ఎమోజి విత్ హెయిర్ (trending emoji with hair) అని టైప్ చేయండి. అప్పుడు వచ్చిన సెర్చ్ రిజల్ట్ లో ఒక ఆర్టికల్ ఉంటుంది. అందులో నుంచి ఎమోజి కాపీ చేసుకోవాలి. తర్వాత మెసేజ్ టైప్ చేసేటప్పుడు పేస్ట్ చేస్తే హెయిర్ ఎమోజి వచ్చేస్తుంది.
ᥬ?᭄ <<< Copy చేసుకోండి
# ఒకవేళ ఎమోజి మధ్యలో ఉన్న స్మైలీ మార్చాలి అంటే,
# స్మైలీ దగ్గర ప్రెస్ చేసి, బ్యాక్ స్పేస్ కొట్టి స్మైలీ రిమూవ్ చెయ్యాలి.
# తర్వాత ఆ ప్లేస్ లో మనకి కావాల్సిన స్మైలీ యాడ్ చేసుకోవచ్చు.
ఇలా హెయిర్ ఉన్న ఎమోజి మీరు కూడా వాడొచ్చు. కావాలంటే ఒకసారి ప్రయత్నించండి. ᥬ?᭄
watch video :
End of Article