“ఈ సారి మాములుగా ఉండదు..!” అంటూ… “అల్లు అర్జున్- త్రివిక్రమ్” సినిమా అనౌన్స్మెంట్ పై 15 మీమ్స్..!

“ఈ సారి మాములుగా ఉండదు..!” అంటూ… “అల్లు అర్జున్- త్రివిక్రమ్” సినిమా అనౌన్స్మెంట్ పై 15 మీమ్స్..!

by kavitha

Ads

సినీ పరిశ్రమలో కొన్ని కాంబినేషన్స్ ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. అలాంటి కాంబినేషన్స్ కు క్రేజ్ మామూలుగా ఉండదు. ఇక వాళ్ళ కాంబినేషన్ లో మూవీ వస్తుందంటే అటు అభిమానులే కాకుండా ఇటు సినీ సెలబ్రెటీలు ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. ఇక అలాంటి కాంబినేషనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

Video Advertisement

ఈ క్రేజీ కాంబోలో ఇప్పటివరకు మూడు చిత్రాలు వచ్చాయి. ఈ  సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన మొదటి చిత్రం జులాయి. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమాను అధికారికంగా ప్రకటిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో పై సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.. Trivikram-Allu-Arjun-movieపది సంవత్సరాల క్రితం ‘జులాయి’ మూవీతో ప్రారంభం అయిన త్రివిక్రమ్ – అల్లు అర్జున్ జర్నీ ‘అల వైకుంఠపురంలో’ వరకు వచ్చింది. వీరి కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో తెరకెక్కాయి. మళ్లీ వీరి  కాంబో ఎప్పుడు వస్తుందా అని బన్నీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజాగా వీరిద్దరు మరోసారి కలిసి సినిమా చేస్తున్నట్లు మేకర్స్‌ అధికారికంగా కన్ఫర్మ్‌ చేశారు.అల్లు అర్జున్ కు ఇది 22వ చిత్రం. త్రివిక్రమ్‌-బన్నీ కాంబోలో నాలుగవ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ఈ సినిమాని గీత ఆర్ట్స్, హారిక అండ్ హాసిని కలిసి నిర్మిస్తున్నారు. ఈ ప్రకటనతో బన్నీ అభిమానుల్లో సంతోషం రెట్టింపైంది. ఇక ఈ మూవీ ఎలా ఉండబోతుంది. ఈ మూవీలో త్రివిక్రమ్ అల్లు అర్జున్ ను ఎలా చూపించబోతున్నారనే   ఆసక్తి  అభిమానుల్లో నెలకొంది. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ రూపొందుతుందని తెలుస్తోంది.అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పుష్పకు సీక్వెల్ గా  రానుంది. ఇదిలా ఉంటే త్రివిక్రమ్‌-బన్నీ నాలుగో మూవీ ప్రకటిస్తూ రిలీజ్ చేసిన వీడియో పై నెట్టింట్లో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి మీరు చూడండి..
1.
2. 3. 4. 5. 6. 7. 8. 9.10.
11. 12. 13. 14. 15. 16. 17. 18.watch video :

Also Read: కమెడియన్ “యోగి బాబు” ఒక్క సినిమాకి ఎంత తీసుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!


End of Article

You may also like