“హీరో విక్రమ్ లాగా ఉన్నారు ఏంటి..?” అంటూ… ఐకాన్ స్టార్ “అల్లు అర్జున్” కొత్త లుక్‌పై 15 మీమ్స్..!

“హీరో విక్రమ్ లాగా ఉన్నారు ఏంటి..?” అంటూ… ఐకాన్ స్టార్ “అల్లు అర్జున్” కొత్త లుక్‌పై 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

గత సంవత్సరం విడుదలైన పుష్ప సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్. అంతకుముందు వరకూ అల్లు అర్జున్ కి సౌత్ ఇండియాలో మాత్రమే చాలా క్రేజ్ ఉంది. పుష్ప సినిమా తర్వాత బాలీవుడ్ లో కూడా అల్లు అర్జున్ కి దాదాపు ఒక బాలీవుడ్ స్టార్ హీరోకి ఉన్నంత క్రేజ్ వచ్చింది. యంగ్ హీరోల నుండి పెద్ద పెద్ద స్టార్ హీరోల వరకూ అందరూ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాని, అందులో అల్లు అర్జున్ నటనని చాలా బాగుందని ప్రశంసించారు.

Video Advertisement

మామూలుగా అల్లు అర్జున్ అంటే గుర్తొచ్చేది స్టైల్. సినిమా సినిమాకి అల్లు అర్జున్ చాలా వేరియేషన్ ఉండేలాగా జాగ్రత్త తీసుకుంటారు. పాత్రల గురించి, ఆ పాత్ర లుక్ గురించి కూడా చిన్న చిన్న విషయాలపై అల్లు అర్జున్ చాలా జాగ్రత్త తీసుకుంటారు. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా, బయట కూడా అల్లు అర్జున్ చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉంటారు. అల్లు అర్జున్ కి సోషల్ మీడియాలో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది.

Trending memes on allu arjun new look for an ad shoot

పుష్ప సినిమా తర్వాత చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం మొదలు పెట్టారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సెకండ్ పార్ట్ సినిమాకి సంబంధించిన చర్చల్లో ఉన్నారు. అల్లు అర్జున్ ఇప్పటి వరకు చాలా అడ్వర్టైజ్మెంట్స్ లో కనిపించారు. ఎన్నో బ్రాండ్స్ కి అల్లు అర్జున్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఇటీవల అల్లు అర్జున్ ఆస్ట్రల్ పైప్స్ అడ్వటైజ్మెంట్ షూట్ చేశారు. ఈ అడ్వర్టైజ్మెంట్ కి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ యాడ్ షూట్ లో అల్లు అర్జున్ లుక్ కి సంబంధించిన ఒక ఫోటో విడుదల అయ్యింది. ఇందులో అల్లు అర్జున్ ఇప్పటి వరకూ కనిపించని ఒక కొత్త గెటప్ లో కనిపిస్తున్నారు. గడ్డంతో, ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో చాలా స్టైలిష్ గా ఉన్నారు. ఈ ఫోటోపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18


End of Article

You may also like