Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవల విడుదల అయ్యింది. ఇప్పుడు మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. మహేష్ బాబు పూజా హెగ్డే కలిసి అంతకుముందు మహర్షి సినిమాలో నటించారు. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా. అతడు ఖలేజా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ ఈ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
Video Advertisement
ఈ సినిమా తరువాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నటిస్తున్నారు. రాజమౌళి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కథా చర్చలు మొదలు పెట్టారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒక యాక్షన్ సినిమాగా రూపొందుతోంది అనే వార్తలు వస్తున్నాయి.
అయితే ఇటీవల మహేష్ బాబు బిల్ గేట్స్ ని కలిసిన ఫోటో వైరల్ అయిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు ఈ ఫోటోని షేర్ చేస్తూ మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది అని రాశారు. అందుకు బిల్ గేట్స్ ఇటీవల రిప్లై ఇచ్చారు. అంతే కాకుండా మహేష్ బాబుని సోషల్ మీడియాలో బిల్ గేట్స్ ఫాలో అవుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
End of Article