Ads
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ స్టార్ అనే గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్. అప్పటి వరకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న క్రేజ్ బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది. మిర్చి తర్వాత బాహుబలిలో ప్రభాస్ నటించారు.
Video Advertisement
బాహుబలిలో ప్రభాస్ అసలు అప్పటి వరకు నటించని ఒక పాత్రలో నటించారు. అందుకోసం చాలా కష్టపడ్డారు. అందుకు తగ్గట్టుగా ఫలితం కూడా వచ్చింది. దాంతో ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఏంటి అని అందరూ ఎదురు చూశారు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో కూడా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని పాన్ ఇండియన్ సినిమాగా విడుదల చేసారు. కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలని అందుకోలేకపోయింది. ఇక ఇదిలా ఉంటే సలార్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. శృతిహాసన్ ప్రభాస్ సరసన నటిస్తోంది. ప్రభాస్ ఇప్పుడు 22వ చిత్రాన్ని చేస్తున్నారు.
అయితే ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమా మళ్ళీ విడుదల అవుతోంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తమిళ్ సినిమా బిల్లాకి రీమేక్. ఇది తెలుగులో కూడా హిట్ అయ్యింది. ఇందులో అనుష్క, నమిత హీరోయిన్లుగా నటించారు. కృష్ణం రాజు గారు కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు. అలాగే ప్రభాస్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మళ్లీ విడుదల అవ్వడంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
End of Article