Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా బ్రో. ఈ చిత్రం రెండు రోజుల్లో (జులై 28న) రిలీజ్ కానుంది. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ఇప్పటికే ‘బ్రో’ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ హైలెట్‌గా ఉండనుందని తెలుస్తోంది.
Video Advertisement
రిలీజ్ దగ్గర పడుతుండడంతో మూవీ యూనిట్ మంగళవారం నాడు సాయంత్రం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తో పాటుగా వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ లు చీఫ్ గెస్ట్ లుగా హాజరయ్యారు. తాజాగా ఈ ఈవెంట్ పై సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
నటుడు మరియు దర్శకుడు సముద్రఖని తెరకెక్కించిన సినిమా బ్రో. తొలిసారిగా మామ, మేనల్లుడు కలిసి నటిస్తున్న మూవీ కావడంతో బ్రో సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన 2 పాటలకు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది.
ఈ మూవీలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. గత కొద్ది రోజుల నుండి మూవీ ప్రమోషన్స్ సాగుతున్నాయి. వాటిలో భాగంగా దర్శకుడు సముధ్రఖని, సాయి ధరమ్ తేజ్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ‘బ్రో’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ముఖ్య అతిథులుగా హజరయ్యారు. ఈ ఈవెంట్ లో పవర స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ విశేషాల గురించి ఉత్సాహంగా మాట్లాడారు. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ, ఎమోషనల్ అయ్యాడు.
చీఫ్ గెస్ట్ గా హాజరు అయిన వరుణ్ తేజ్ మాట్లాడుతూ సినిమాల్లో ఉన్నా, పాలిటిక్స్ లో ఉన్నా మా ఫ్యామిలీ అంతా బాబాయి వెనకే ఉంటాం అని చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉంటే బ్రో ప్రీ రిలీజ్ వేడుక పై సోషల్ మీడియాలో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూడండి.
1. 2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
Also Read: సీనియర్ ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవో తెలుసా..? ఆయన ఎలాంటి ఆహారం తీసుకునే వారు అంటే..?
End of Article