Ads
తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. పాత చిత్రాలలో హిట్, ఫ్లాప్ అనే తేడా లేకుండా పలు చిత్రాలను రీరిలీజ్ చేస్తున్నారు. గతంలో ప్లాప్ అయిన సినిమాలు సైతం రీరిలీజ్ లో మంచి కలెక్షన్స్ సాధిస్తుండడం విశేషం.
Video Advertisement
ఈ ట్రెండ్ గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజున ఇండస్ట్రీ హిట్ మూవీ పోకిరి రీరిలీజ్ తో మొదలైంది. ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతోంది. నేడు మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా బ్లాక్ బస్టర్ మూవీ ‘బిజినెస్‌మేన్’ రీరిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.సూపర్ స్టార్ మహేష్ బాబు, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి, బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఆ తరువాత వారిద్దరి కాంబోలో తెరకెక్కిన రెండవ చిత్రం ‘బిజినెస్ మేన్’. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు యాక్షన్. డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
మహేష్ బాబు హీరోగా నటించిన పలు చిత్రాలు థియేటర్లలో రి రిలీజై సెన్సేషన్ సృష్టించగా, ఈ ఏడాది మహేష్ పుట్టినరోజు సందర్భంగా రీరిలీజ్ అవుతున్న బిజినెస్ మేన్ సినిమా కూడా రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో కోటి రూపాయల గ్రాస్ మార్క్ ను దాటిందని తెలుస్తోంది.
హైదరాబాద్ లో 172 షోలు పడుతుండగా, వీటిలో 110 హౌస్ ఫుల్స్ అయినట్టు తెలుస్తోంది. మహేష్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు బిజినెస్ మేన్ మూవీ రీరిలీజ్ పై పలు మీమ్స్ నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూడడండి..
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
Also Read: “మహేష్ బాబు – త్రివిక్రమ్” సినిమాతో పాటు… “సంక్రాంతి – 2024” కి రిలీజ్ అవుతున్న 6 పెద్ద సినిమాలు..!
End of Article