“వింటేజ్ మెగాస్టార్ గుర్తొచ్చాడు..!” అంటూ… వాల్తేరు వీరయ్య “బాస్ పార్టీ” పాటపై 15 మీమ్స్..!

“వింటేజ్ మెగాస్టార్ గుర్తొచ్చాడు..!” అంటూ… వాల్తేరు వీరయ్య “బాస్ పార్టీ” పాటపై 15 మీమ్స్..!

by kavitha

Ads

మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. కె.ఎస్.రవీంద్ర(బాబి) దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ప్రస్తుతం ఈ మూవీ టీమ్ ప్రమోషన్స్ లో భాగంగా సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను ఒక్కొక్కటిగా వదులుతున్నారు.

Video Advertisement

ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన తొలి సింగిల్ సాంగ్ ప్రోమోను మంగళవారం విడుదల చేశారు. ఈ బాస్ పార్టీ ప్రోమోలో దేవి శ్రీ ప్రసాద్ మార్క్ కనిపించేలా మాస్ బీట్స్, దేవి డైలాగ్స్ తో స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ప్రోమోను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

trending memes on chiranjeevi waltair veerayya boss party song

బాస్ పార్టీ సాంగ్ ప్రోమోను ఇందులో ట్యూన్, లిరిక్స్ ను చూసి జనాలు దేవీ శ్రీ ప్రసాద్‌ను తిడుతున్నారు.ఎందయ్యా దేవి ఇదేం ట్యూన్,ఇదెక్కడి పాట అని ఏకిపారేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌కు సోషల్ మీడియాలో ఎదురుదెబ్బ తగిలేట్టు కనిపిస్తోంది. అసలే ఈమధ్య దేవీ శ్రీ ప్రసాద్‌ టైం బాగా లేనట్టు ఉంది. ఓ పరి సాంగ్ వివాదంతో దేవీ శ్రీ ప్రసాద్ ఇంకా బయటపడకముందే, ఇప్పుడు బాస్ పార్టీ సాంగ్‌ ప్రోమో ట్రోలింగ్‌కు అవుతోంది.

కొందరైతే పాటలు కొట్టడం ఆపి రెస్ట్ తీసుకో అంటూ ట్రోల్స్ వేస్తున్నారు. ఇదేం పాటరా అంటూ దారుణంగా తిడుతున్నారు. అయితే గుడ్డిలో మెల్ల అన్నట్టు కొంత మంది మాత్రం దేవీ శ్రీ ప్రసాద్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ పాటలు మొదట్లో అలానే అనిపించినా,ఆ తరువాత అవే ఎక్కేస్తాయ్ అంటున్నారు.మొత్తానికి అయితే బాస్ పార్టీ ప్రోమో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.

మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న వాల్తేరు వీరయ్య చిత్రంలో ర‌వితేజ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీలో శృతిహాస‌న్ నటిస్తుంది.. వాల్తేరు వీరయ్య 2023 జనవరి 13న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.
1.

2.


3.

4.

5.

6.


7.


8.


9.

 

10.

11.

12.

13.

14.

15.

16.

17.

18.

watch video :


End of Article

You may also like