Ads
ఇటీవల ఓటీటీలో విడుదలైన సినిమాల్లో కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలోడీస్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇందులో ముఖ్యంగా కలర్ ఫోటో అయితే ఎంతో మంది ప్రశంసలు అందుకుంది. మిడిల్ క్లాస్ మెలోడీస్ నవంబర్ 20 వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ సినిమాకి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ రెండు సినిమాలు చాలా నాచురల్ గా ఉన్నాయి అని అంటున్నారు ప్రేక్షకులు. ఈ రెండు సినిమాల ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన నటి దివ్య శ్రీపాద.
Video Advertisement
దివ్య ని మనలో చాలా మంది అంతకుముందు చాయ్ బిస్కెట్, గర్ల్ ఫార్ములా వీడియోస్ లో చూసే ఉంటాం. దివ్య యాక్టింగ్ లోకి అడుగుపెట్టక ముందు ఒక కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. కానీ ఉద్యోగం నచ్చక, ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఆడిషన్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. గర్ల్ ఫార్ములా లో ఆడిషన్ లో సెలక్ట్ అయ్యారు దివ్య.
ఈ వీడియోస్ లో కాన్సెప్ట్స్ చాలా రిలేట్ అయ్యేలా ఉంటాయి. దివ్య కూడా అంతే బాగా పర్ఫార్మ్ చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే దివ్య ని చూస్తే మన పక్కింటి అమ్మాయిలాగా అనిపిస్తారు. అంత నాచురల్ గా ఉంటుంది దివ్య యాక్టింగ్. 2019 లో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాలో దివ్య మొదటి సారిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించారు.
ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ గా కనిపించారు దివ్య. తర్వాత ఇటీవల వచ్చిన కలర్ ఫోటో సినిమాలో, మిడిల్ క్లాస్ మెలోడీస్ లో, అలాగే మిస్ ఇండియా సినిమాలో కూడా నటించారు దివ్య.
సాధారణంగా చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. మన వాళ్ళు సినిమా రంగంలో ఎక్కువగా పైకి రాలేరు అని, ఇలా ఏవేవో అంటుంటారు. కానీ అవన్నీ తప్పు అని, టాలెంట్ ఉంటే ఎంత దూరమైనా వెళ్ళవచ్చు అని చెప్పడానికి దివ్య ఒక ఉదాహరణగా నిలిచారు.
#1
#2 #3 #4 #5 #6 #7 #8 #9 #10 #11 #12 #13 #14 #15 #16 #17 #18 #19 #20
End of Article