“ఈ సినిమాకి క్రేజ్ ఇంకా తగ్గలేదు..!” అంటూ… “ఈ నగరానికి ఏమైంది” సినిమా రీ-రిలీజ్‌పై 15 మీమ్స్..!

“ఈ సినిమాకి క్రేజ్ ఇంకా తగ్గలేదు..!” అంటూ… “ఈ నగరానికి ఏమైంది” సినిమా రీ-రిలీజ్‌పై 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

సినిమాలు ఒక్కొక్కసారి విడుదలైనప్పటికంటే కూడా కాస్త సమయం గడిచిన తరువాత వాటిలోని కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వినడానికి విచిత్రంగా ఉన్న ఇటువంటివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇదే ప్రస్తుతం ఐదు సంవత్సరాల తర్వాత రీ రిలీజ్ అయిన ఈనగరానికి ఏమైంది మూవీ పరిస్థితి.

Video Advertisement

మొదట ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలో ఎవరు ఈ మూవీని పట్టించుకున్న వాళ్లు లేరు. అనుకున్న రేంజ్ లో ఆడియన్స్ కి దగ్గర కాలేకపోవడంతో సినిమాను తర్వాత డిజిటల్ మరియు టీవీ చానల్స్ లో ప్రసారం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా పుణ్యమా అని ఇందులోని కొన్ని సీన్స్ మరియు డైలాగ్స్ ఓ రేంజ్ మీమ్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా వారిని ఆకట్టుకున్నాయి కూడా.

vishwak sen

దీంతో మెల్లిగా ఈ సినిమా పాపిలారిటీ ఏ రేంజ్ కి వెళ్ళిందంటే ఈరోజు థియేటర్లో రీ రిలీజ్ అయిన ఈ మూవీ ఊహించని కలెక్షన్స్ తో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. గుంటూరు, వైజాగ్ లాంటి పలు సెంటర్స్ లో ఈ మూవీ బుకింగ్స్ కి టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. కొత్త సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీ జోరు మాత్రం తగ్గేదే లేదన్నట్టు ముందుకు వెళ్తోంది.

Trending memes on ee nagaraniki emaindi re release

మరోపక్క ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ట్రేడ్ మార్క్ డైలాగ్స్ తో చేసిన మీమ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మూవీ రిలీస్ కు సంబంధించి చిత్రంలోని పలు డైలాగ్లను ఉపయోగించి తయారుచేసిన ఈ మీమ్స్ వెరైటీ గానే కాకుండా బాగా ఎంటర్టైనింగ్ గా ఉండడంతో విపరీతమైన లైక్ మరియు షేర్స్ సొంతం చేసుకుంటున్నాయి. వీటితో పాటుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని న్యూస్లకు ట్యాగ్లైన్ గా ఈ చిత్రంలోని డైలాగ్స్ పెట్టి సృష్టించిన మీమ్స్ బాగా కామెడీగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ చిత్రానికి సంబంధించిన కామెడీ సన్నివేశాలను ఆది పురుష్ మూవీ నెగటివ్ ట్రోల్స్ కి విపరీతంగా వాడుతున్నారు.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18


End of Article

You may also like