హైదరాబాదులో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖైరతాబాద్, అమీర్ పేట్, పంజాగుట్ట, సికింద్రాబాద్, బోయిన్పల్లి, అల్వాల్, ముషీరాబాద్, మల్కాజ్ గిరి, బేగంపేట చంపాపేట్, సరూర్ నగర్ లో భారీ వర్షం ఈదురు గాలులతో పాటు కురుస్తోంది.
అలానే ఈదురుగాలులతో వర్షం కొత్త పేట, నాగోల్ లో కురవడంతో కరెంట్ కూడా పోయింది. ఎల్బీనగర్, దిల్షుక్ నగర్ లో ఉరుములు మరియు భారీ వర్షం పడడంతో నగరంలోని రోడ్లపై వరద పొంగి పొరలింది.
కొన్ని కాలనీలు అయితే జలమయమయ్యాయి. ఎల్బినగర్ ఫ్లైఓవర్ వద్ద వరద నీరు నిలిచిపోవడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఖైరతాబాద్, బంజారాహిల్స్ కూడలి వద్ద మోకాళ్ళ లోతులో నీరు చేరి పోయింది. యూసఫ్ గూడ నుంచి మైత్రివనం వెళ్లే దారిలో స్టేట్ హోం వద్ద రోడ్ల పై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఈ వర్షంతో ఎండ వేడి తో అల్లాడుతున్న ప్రజలకు కాస్త రిలీఫ్ లభించింది. నేడు రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
#1
#2
#3
#4
#5
#6
#7