“ఇది కదా రెబల్ స్టార్ రేంజ్ సినిమా..!” అంటూ… ప్రభాస్ “కల్కి 2898 AD” రిలీజ్‌పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

“ఇది కదా రెబల్ స్టార్ రేంజ్ సినిమా..!” అంటూ… ప్రభాస్ “కల్కి 2898 AD” రిలీజ్‌పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

ఎట్టకేలకి ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా విడుదల అయ్యింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, రాజేంద్రప్రసాద్, దిశా పటాని, శోభన ముఖ్య పాత్రలు పోషించారు. ఇంకా అతిథి పాత్రల్లో కొంతమంది ప్రముఖ నటీనటులు, దర్శకులు కనిపించారు. ఈ సినిమా కోసం దేశం అంతా కూడా ఎదురుచూసింది. పురాణాల నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ఇది. ఇది కేవలం మొదటి భాగం మాత్రమే.

Video Advertisement

trending memes on kalki 2898 ad release

కల్కి సినిమాటిక్ యూనివర్స్ పేరుతో ఈ సినిమా తర్వాత ఇంకా కొనసాగింపుగా కొన్ని సినిమాలు వస్తాయి. సినిమాలో అందరికీ ప్రాముఖ్యత ఉంటుంది. దిశాపటాని పాత్ర మాత్రం కేవలం కొంచెం సేపు మాత్రమే కనిపిస్తారు. హీరో పక్కన ఉంటారు. కానీ మిగిలిన వాళ్ళందరికీ కూడా మంచి పాత్రలు రాశారు. రాజమౌళి తర్వాత అంత బడ్జెట్ తో సినిమా రూపొందించిన దర్శకుడు నాగ్ అశ్విన్ మాత్రమే. సి. అశ్వినీదత్ ఈ సినిమాని నిర్మించారు. సినిమా టెక్నికల్ గా కూడా చాలా బాగుంది.

సెట్ డిజైన్ దగ్గర నుండి గ్రాఫిక్స్ వరకు అన్నీ కూడా చాలా బాగా ఉండేలాగా చూసుకున్నారు. తెలుగు సినిమాల్లో ఇలాంటి గ్రాఫిక్స్ ఉన్న సినిమా ఇప్పటివరకు రాలేదు. క్లైమాక్స్ కూడా కొత్తగా అనిపిస్తుంది. సినిమా అంతా కూడా ప్రభాస్ పాత్రని ఒకలాగా అనుకుంటారు. కానీ చివరికి ప్రభాస్ పాత్ర ఎవరు అనేది తెలుస్తుంది. దాంతో నెక్స్ట్ పార్ట్ ఎలా ఉండబోతోంది అనే ఆసక్తితోనే ఈ సినిమా ముగించారు. ఈ విషయం మీద సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఇవే.

 

 


End of Article

You may also like