“కార్తికేయ-2” సినిమాకి… “హిట్ టాక్” రావడంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

“కార్తికేయ-2” సినిమాకి… “హిట్ టాక్” రావడంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Mohana Priya

నిఖిల్ హీరోగా కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన కార్తికేయ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఆ సినిమాకి పార్ట్ 2 ఉంటుంది అనగానే ప్రేక్షకులు అందరూ కూడా అది ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూశారు. కార్తికేయ-2 మొదటి భాగం మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్ గా నడుస్తుంది. రెండవ భాగం ట్రైలర్ చూస్తే కూడా ఈ సినిమా కూడా అలాగే ఉండబోతోంది అని అర్థం అయింది. మొదటి భాగంతో పోల్చి చూస్తే ఈ సినిమాలో కథ లోతు ఇంకా ఎక్కువగా ఉంటుంది. సినిమా మొత్తం ఫోకస్ కూడా కేవలం ఒక్క విషయం మీదే ఉంటుంది.

Video Advertisement

ఒక సినిమాకి కథ చాలా బలమైనది. కాబట్టి ఆ కథ ఎంత బాగుంటే సినిమా మీద ప్రేక్షకుల ఆసక్తి కూడా అంతే బాగుంటుంది. సినిమా మొదటినుంచి చివరి వరకు సస్పెన్స్ తో సాగుతుంది. ఇంటర్వెల్ కూడా నెక్స్ట్ ఏమవుతుంది అనే సస్పెన్స్ సృష్టిస్తుంది. సినిమాకి కథతో పాటు మరొక ముఖ్య బలం నిఖిల్ నటన. నిఖిల్ కూడా అలాగే ఒక డాక్టర్ లాగా ఆ పాత్రకి ఎంత ఎమోషన్స్ అయితే అవసరమో అంతే ఎమోషన్స్ తెరపై చూపిస్తూ నటించారు.

Trending memes on karthikeya 2 hit talk

మిగిలిన పాత్రలు అన్నీ కూడా నిఖిల్ పాత్రకి సహాయం చేయడానికి ఉంటాయి. కానీ సినిమా మొత్తాన్ని నిఖిల్ నడిపించారు. అనుపమ పరమేశ్వరన్ తన పాత్ర పరిధి మేరకు నటించారు. చాలా రోజుల తర్వాత ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా వచ్చింది. ఆ సినిమాకి కూడా హిట్ టాక్ వస్తోంది. సాధారణంగా ఒక సినిమాకి కొనసాగింపుగా మరో సినిమా వస్తోంది అంటే ఆ సినిమా ఎలా ఉంటుందో అని అనుకుంటూ ఉంటారు. ఈ సినిమా మాత్రం మొదటి భాగం లాగానే మంచి టాక్ తెచ్చుకుంటోంది. ఈ సినిమాతో మళ్లీ ఈ మధ్యకాలంలో మరొక హిట్ వచ్చింది అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18#19#20#21 #22#23#24


You may also like