Ads
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అవుతోంది. అంతకుముందు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ కూడా తెలుగు భాషలో మాత్రమే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమా ఈ భాషలతో పాటు హిందీలో కూడా విడుదల అవుతోంది. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు.
Video Advertisement
రమ్య కృష్ణన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఒక బాక్సర్ గా విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. అలాగే మైక్ టైసన్ కూడా మొదటిసారి ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి విడుదల అయిన టీజర్, పోస్టర్స్ ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులకి ఆసక్తి కలిగించేలా ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాలోని మొదటి పాట విడుదల అయ్యింది. ఈ పాటలో హీరో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్ అనన్య పాండే కూడా కనిపిస్తున్నారు.
ఈ పాటలో విజయ్ దేవరకొండ డాన్స్ బాగుంది అంటూ చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఏ సినిమాలో కూడా ఇలా డాన్స్ చేయలేదు. దాంట్లో విజయ్ దేవరకొండ చాలా బాగా డాన్స్ చేశారు అని, ఇప్పటివరకు విజయ్ దేవరకొండ ఇలా డ్యాన్స్ చేయడం చూడలేదు అని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే పాట లిరిక్స్ మాత్రం తెలుగులో చాలా వెరైటీగా ఉన్నాయి. తెలుగులో మాత్రమే కాకుండా ఇతర సౌత్ ఇండియన్ భాషల్లో కూడా లిరిక్స్ ఇలాగే ఉన్నాయి. దాంతో పాట బాగుంది కానీ లిరిక్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ పాట పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
#21
#22
End of Article