Ads
గత సంవత్సరం విడుదల అయిన సర్కారు వారి పాట సినిమాతో హిట్ కొట్టారు మహేష్ బాబు. ఇప్పుడు మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ ఇద్దరు కలిసి అంతకుముందు అతడు, ఖలేజా సినిమాలు చేశారు. ఖలేజా సినిమా అనుకున్నట్టు ఆడకపోయినా కూడా ఈ సినిమాకి ఇప్పటికీ చాలా మంది అభిమానులు ఉన్నారు.
Video Advertisement
ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమాకి ఎలా ఉండబోతోంది అని ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ నిన్న విడుదల చేశారు. ఇందులో మహేష్ బాబు ఏదో ఒక మిర్చి యార్డ్ లో నడుస్తున్నట్టు కనిపిస్తోంది.
పోస్టర్ తో పాటు సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల అవుతుంది అని ప్రకటించారు. కొంత మంది, “మహేష్ బాబు లుక్ చాలా బాగుంది” అని అంటూ ఉంటే, మరి కొంత మంది మాత్రం, “అయితే ఈ సంవత్సరం సినిమా లేదా” అని అంటున్నారు. ఈ సినిమా పోస్టర్ చూస్తూ ఉంటే ఈ సారి త్రివిక్రమ్ శ్రీనివాస్ యాక్షన్ సినిమా తీస్తున్నారు ఏమో అని అంటున్నారు. అంతే కాకుండా మహేష్ బాబుని ఇలా చూసి చాలా సంవత్సరాలు అయ్యింది అని కామెంట్స్ వస్తున్నాయి. ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18
End of Article