Ads
మంచు విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరు మాత్రమే కాకుండా ఈ సినిమాలో ఎంతో మంది ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. మంచు విష్ణు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Video Advertisement
అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఇవాళ విడుదల అయ్యింది. టీజర్ చూస్తూ ఉంటే ఇది ఒక హారర్ కామెడీ సినిమా అని అర్థం అవుతోంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఒక పాట రిలీజ్ చేశారు. ఆ పాటని మంచు విష్ణు కూతుర్లు అరియానా-వివియానా పాడారు. ఆ పాటలో వారు కనిపిస్తారు. ఈ సినిమాలో మంచు విష్ణు గెటప్ చాలా డిఫరెంట్ గా ఉంది. సినిమా హారర్ కామెడీ అని టీజర్ చూసేంత వరకు ప్రేక్షకులకు అర్థం అవ్వలేదు.
సన్నీ లియోన్ అంతకుముందు మంచు మనోజ్ హీరోగా నటించిన కరెంట్ తీగ సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో ఇప్పుడు నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల అవుతుంది. ఇప్పుడు అయితే ఈ సినిమా తెలుగు టీజర్ విడుదల అయ్యింది. ఈ టీజర్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7.
#8
#9
#10
#11
#12
End of Article