Ads
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నారప్ప సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా ఆసురన్ కి రీమేక్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమాలో ధనుష్ నటనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సినిమా అనౌన్స్ చేసిన అప్పటి నుంచి కూడా ప్రేక్షకులలో “అసలు ఎలా ఉండబోతోంది? తమిళంలో ధనుష్ చేసినట్టే తెలుగులో వెంకటేష్ చేస్తారా? కథలో ఏమైనా మార్పులు చేస్తారా? లేకపోతే అదే కథని తెలుగులో తీస్తారా? మన నేటివిటీ కి సెట్ అవుతుందా? ఇలాంటి అనుమానాలు చాలానే ఉన్నాయి.
Video Advertisement
నిజానికి ఈ సినిమా థియేటర్లలో విడుదల కావాల్సి ఉన్నా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అమెజాన్ లో విడుదల చేశారు. సినిమా మొదలైనప్పటి నుండి చివరి వరకు సస్పెన్స్ కొనసాగుతుంది. మధ్యమధ్యలో డల్ గా అనిపించినా కూడా అంత పెద్దగా ఇబ్బంది కలగదు. నారప్ప సినిమాలో మనం మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన వ్యక్తి వెంకటేష్.
ఈ సినిమా మళ్లీ చాలా రోజుల తర్వాత వెంకటేష్ లోని నటుడిని చూపించింది అని చెప్పొచ్చు. మనం గత కొన్ని సంవత్సరాల నుండి వెంకటేష్ ని కమర్షియల్ సినిమాల్లోనే చూస్తున్నాం. కానీ ఈ సినిమా వెంకటేష్ ఎలాంటి పాత్ర అయినా సరే చేయగలరు అని మరొకసారి రుజువు చేసింది. ప్రియమణి, కార్తిక్ రత్నం, రాజీవ్ కనకాల మిగిలిన అందరూ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
End of Article