Ads
శర్వానంద్ హీరోగా నటించిన ఒకే ఒక జీవితం సినిమా ఇవాళ విడుదల అయ్యింది. టైం మిషన్, టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ మీద తెలుగులో అంతకుముందు చాలా సినిమాలు వచ్చాయి. అవి అన్నీ కూడా మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు ఒకే ఒక జీవితం సినిమా కూడా దాదాపు అలాంటి కాన్సెప్ట్ మీద వచ్చిన సినిమా.
Video Advertisement
ఈ సినిమా ఒక ఎమోషనల్ డ్రామాగా సాగుతుంది. తల్లి కొడుకుల బంధం ఈ సినిమాలో హైలైట్ చేశారు. అమల, శర్వానంద్ మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులకు చాలా ఎమోషనల్ గా అనిపిస్తాయి. ఈ సినిమాలో కూడా అంతా మామూలుగా సాగుతున్న సమయంలో ఒక ట్విస్ట్ ఇచ్చి నెక్స్ట్ ఏమవుతుంది అనే సస్పెన్స్ క్రియేట్ చేశారు.
కేవలం తల్లి కొడుకుల సెంటిమెంట్ మాత్రమే కాకుండా అసలు మనిషి ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనే విషయాన్ని చాలా బాగా చూపించారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శర్వానంద్ పాత్రకు తగ్గట్టుగా నటించారు. కమర్షియల్ పాత్రలకు భిన్నంగా ఈ పాత్ర చేయడానికి ముందడుగు వేసిన శర్వానంద్ ని నిజంగానే అభినందించాలి. ప్రియదర్శి కూడా తన పాత్ర పరిధి మేరకు నటించారు. వెన్నెల కిషోర్ పాత్ర సినిమాకి ఒక హైలైట్ గా నిలుస్తుంది. కామెడీ చాలా చోట్ల వర్కౌట్ అయింది. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ అమల అక్కినేని సినిమాలో నటించారు. అమల నటన సినిమాకి ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఈ సినిమాకి ఇప్పుడు హిట్ టాక్ వస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
#21
End of Article