Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సినిమాల్లో ఇప్పటికి కూడా గొప్పగా మాట్లాడుకునే సినిమాల్లో ఒక సినిమా ఒక్కడు. ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఇందులో భూమిక హీరోయిన్ గా నటించారు. ప్రకాష్ రాజ్ నెగటివ్ పాత్రలో నటించారు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించారు.
Video Advertisement
అప్పటివరకు మహేష్ బాబుని సాధారణమైన రోల్స్ లో మాత్రమే చూశారు. ఈ సినిమా మహేష్ బాబుకి ఒక స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది. మహేష్ బాబు యాక్షన్ సినిమాలు కూడా చేయగలరు అని నిరూపించిన సినిమా ఇది. మహేష్ బాబు కెరీర్ లోనే బెస్ట్ సినిమాల్లో ఒక సినిమాగా ఈ సినిమా నిలుస్తుంది. అయితే ఇంకా కొద్ది రోజుల్లో మహేష్ బాబు పుట్టినరోజు రాబోతోంది. ఈ సందర్భంగా పోకిరి సినిమాని థియేటర్లలో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు ఒక్కడు సినిమా ప్రీమియర్ షో కూడా ఇటీవల జరిగింది. ఈ సినిమాకి రెస్పాన్స్ ఒక కొత్త సినిమా విడుదల అయితే ఎటువంటి స్పందన వస్తుందో అదే విధంగా ఉంది. సినిమా విడుదలయ్యి ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఈ సినిమాకి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏమో అన్నట్టుగా అనిపించింది. రాజమండ్రిలో ఈ సినిమా స్పెషల్ షో జరిగింది. ఆగస్ట్ 9వ తేదీన పోకిరి సినిమా స్పెషల్ షో కూడా ప్రదర్శిస్తారు. అయితే ఇప్పుడు ఒక్కడు సినిమాకి ఇంత మంచి స్పందన రావడంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
End of Article