Ads
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ స్టార్ అనే గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్. అప్పటి వరకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న క్రేజ్ బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది. మిర్చి తర్వాత బాహుబలిలో ప్రభాస్ నటించారు. బాహుబలిలో ప్రభాస్ అసలు అప్పటి వరకు నటించని ఒక పాత్రలో నటించారు. అందుకోసం చాలా కష్టపడ్డారు.
Video Advertisement
అందుకు తగ్గట్టుగా ఫలితం కూడా వచ్చింది. దాంతో ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఏంటి అని అందరూ ఎదురు చూశారు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో కూడా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని పాన్ ఇండియన్ సినిమాగా విడుదల చేసారు. కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలని అందుకోలేకపోయింది. ఇటీవల విడుదల అయిన రాధే శ్యామ్‌కి వచ్చిన రెస్పాన్స్ కూడా అలాగే ఉంది.
ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ కి సంబంధించి ఒక స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ స్టిల్ చూస్తుంటే ఎదో ఫైట్‌కి సంబంధంచిన షూటింగ్ జరుగుతోంది అని అర్దం అవుతోంది. కేజీఎఫ్ సినిమా చూసిన తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇప్పుడు మళ్లీ సాహో, రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ కి మరొక హిట్ సినిమా ఇదే అవుతుంది అని అంటున్నారు. ఈ లీక్ అయిన ఫోటో పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2#3#4#5#6#7#8#9#10#11#12
End of Article