Ads
ఈ సంవత్సరం కూడా కరోనా కారణంగా ఎన్నో సినిమాలు విడుదల అవకుండా ఆగిపోయాయి. కొన్ని డైరెక్ట్ డిజిటల్ అవ్వగా, రిలీజ్ కొన్ని మాత్రం థియేటర్లు తెరిచేంత వరకు ఎదురు చూసి థియేటర్లలోనే విడుదల అయ్యాయి. కొన్ని సినిమాలు మాత్రం విడుదలను వాయిదా వేసుకున్నాయి. ఆ జాబితాలో ఇప్పుడు ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న రాధే శ్యాం కూడా చేరింది. ఈ సినిమా అసలు జూలై 30 వ తేదీన విడుదల కావలసి ఉంది. కానీ సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు సినిమా బృందం ప్రకటించింది. రాధే శ్యాం సినిమా జనవరి 14 వ తేదీన 2022 లో సంక్రాంతి సందర్భంగా రాబోతోంది.
Video Advertisement
అయితే కృష్ణాష్టమి సందర్భంగా రాధే శ్యాం సినిమా బృందం ఒక స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో పూజా హెగ్డే పియానో వాయిస్తూ ఉండగా, ప్రభాస్ పక్కనే నిలబడి ఉన్నారు. ఇప్పటివరకు ఎలాంటి సందర్భంలో అయినా రాధే శ్యాం సినిమా బృందం ఏదో ఒక స్పెషల్ పోస్టర్ విడుదల చేస్తోంది. కానీ టీజర్, ట్రైలర్, లేదా పాటకి సంబంధించిన అప్డేట్ ఒక్కటి కూడా విడుదల చేయలేదు. దాంతో ఇలా ప్రతిసారి పోస్టర్ రిలీజ్ చేసే బదులు ఏదైనా అప్డేట్ ఇవ్వచ్చు కదా అంటూ సోషల్ మీడియాలో ఈ విధంగా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
End of Article