Ads
2021 లో తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా, భారత దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. బాహుబలి ద కంక్లూజన్ తర్వాత దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత మళ్లీ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మా ఇంత ఆసక్తి క్రియేట్ అవ్వడానికి ముఖ్యమైన అంశం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించడం. మామూలుగా అయితే ఒక ఇద్దరు యంగ్ హీరోస్ కలిసి నటించడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం.
Video Advertisement
అంటే ఒక యంగ్ హీరో, ఒక సీనియర్ హీరో కలిసి నటించడం చూస్తూ ఉంటాం. కానీ ఇలా ఇద్దరు ఒకే జనరేషన్ కి చెందిన హీరోలు కలిసి నటించడం ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. అలా ఎప్పుడో ఒకసారి జరిగినప్పుడు వచ్చిన సినిమానే ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ఇంట్రడక్షన్ వీడియోస్ ఇవన్నీ ప్రేక్షకుల ఆసక్తిని ఇంకా పెంచాయి. ఈ సినిమాతో ఆలియా భట్ కూడా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.
ఇప్పటికే ఆలియా భట్ తెలుగు నేర్చుకునే పనిలో ఉన్నారు అని ఇటీవల వకీల్ సాబ్ విడుదల సమయంలో ఆలియా భట్ చేసిన వీడియో, అలాగే కరోనా జాగ్రత్తలు చెప్తూ ఆర్ఆర్ఆర్ సినిమా బృందం చేసిన వీడియోలో ఆలియా భట్ తెలుగు మాట్లాడటం చూసి మనందరికీ అర్థమైపోయి ఉంటుంది. అలియా భట్ మాత్రమే కాకుండా ఒలీవియా మోరిస్ కూడా ఈ సినిమాలో ఇంకొక హీరోయిన్ గా నటిస్తున్నారు.
అయితే ఈ సినిమాకి సంబంధించి రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ అనే ఒక వీడియో జూలై 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు సినిమా బృందం ప్రకటించింది. అన్నట్టుగానే ఈ వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో సినిమా బృందం అందరూ కనిపిస్తారు. వారిలో శ్రియ శరన్, సముద్రఖని, అజయ్ దేవగన్ కూడా ఉన్నారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15
End of Article