Ads
తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొంత కాలంలోనే స్టార్ హీరోయిన్ అనే గుర్తింపు సంపాదించుకున్న నటి సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో సాయి పల్లవి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మొదటి సినిమాతోనే సాయి పల్లవి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
Video Advertisement
తర్వాత తెలుగుతో పాటు తమిళం మలయాళం సినిమాల్లో కూడా నటించారు. సాయి పల్లవి నటించిన సినిమాలు కొన్ని అయినా కూడా ప్రతి సినిమాకి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. సాధారణంగా హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలి అనే ఒక ఆలోచనని సాయిపల్లవి మార్చారు. దాంతో సాయి పల్లవి అంటే సౌత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులకి ఒక అభిమానం ఉంది.
సాయి పల్లవి ఏ భాష సినిమాలో నటించిన సరే ఆ భాషలో తనే డబ్బింగ్ చెప్పుకుంటారు. అయితే ఇటీవల ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు సుకుమార్ సాయి పల్లవి ని లేడీ పవర్ స్టార్ అని అన్నారు. నిజంగానే సాయి పల్లవి ని చాలా మంది లేడీ పవర్స్టార్ అంటున్నారు ఇటీవల జరిగిన విరాటపర్వం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా సాయి పల్లవి సంబంధించి ఒక స్పెషల్ వీడియో టెలికాస్ట్ చేశారు అందులో సాయి పల్లవి ని లేడీ పవర్ స్టార్ అని అన్నారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16
End of Article