Ads
2020 సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో సినిమాలతో మొదలయ్యింది. రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వడంతో 2020 కి గుడ్ స్టార్ట్ వచ్చింది. తర్వాత వచ్చిన భీష్మ కూడా సూపర్ హిట్ అయ్యింది. కానీ మార్చి నుంచి ఒక్క సినిమా కూడా థియేటర్లో విడుదల అవ్వలేదు. అందుకు కారణం ఏంటో మనందరికీ తెలుసు. 2020 చివరి నుండి మళ్లీ మెల్లగా సినిమాలు విడుదలవడం మొదలయ్యింది. ఇంక 2021 క్రాక్, మాస్టర్, రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాలతో మొదలయ్యింది.
Video Advertisement
వీటిలో అల్లుడు అదుర్స్ తప్ప మిగిలిన సినిమాలు అన్ని మంచి టాక్ సాధించాయి. పెద్ద సినిమాల షూటింగ్స్ కూడా మళ్లీ మొదలయ్యాయి. 2021 సంవత్సరం ఇటీవలే మొదలైనా కూడా, 2022 లో విడుదలయ్యే సినిమాల గురించి కూడా ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నారు. అందులో లో మొదటిది సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట కాగా, తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా కూడా ఉంది.
అలాగే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్ లో రాబోతున్న ఆదిపురుష్ కూడా 2022 లో విడుదల అవ్వనున్నట్టు అంతకుముందే ప్రకటించారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న సలార్ సినిమా కూడా చేరింది. సలార్ 2022 లో ఏప్రిల్ 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఫిబ్రవరి 28వ తేదీన సినిమా టీం సోషల్ మీడియాలో ప్రకటించింది.
అయితే, రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కి విడుదల చేసిన స్టిల్ చూస్తూ ఉంటే ఈ సినిమా బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ తో నడుస్తుంది ఏమో అనే ఆలోచన ఒకటి ప్రేక్షకులలో మొదలయ్యింది. ఈ సినిమా గురించి ఇంకా కొన్ని వివరాలు తెలియాలంటే టీజర్ లేదా ట్రైలర్ విడుదల అయ్యేంతవరకు ఆగాల్సిందే. సలార్ లో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సలార్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2#3#4#5#6#7
#8
#9#10#11#12#13#14
#15
End of Article