“ఏదిరా.. ఇప్పుడు ట్రోల్ చేయండి..!” అంటూ … “కళావతి” సాంగ్‌పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

“ఏదిరా.. ఇప్పుడు ట్రోల్ చేయండి..!” అంటూ … “కళావతి” సాంగ్‌పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట టీజర్ ఇప్పటికే యూట్యూబ్‌లో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ టీజర్‌లో మహేష్ బాబు చాలా స్టైలిష్‌గా, డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమా మొదటి పాట ఫిబ్రవరి 14న విడుదల అవ్వబోతోంది.

Video Advertisement

ఈ సినిమాకి సోలో, గీతగోవిందం సినిమాలకు దర్శకత్వం వహించిన పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్‌లో మహేష్ బాబు, హీరోయిన్ కీర్తి సురేష్‌తో పాటు, వెన్నెల కిషోర్ కూడా కనిపించారు. అయితే సినిమాలో కళావతి పాట విడుదల అయ్యింది. ఇందులో మహేష్ బాబు, కీర్తి సురేష్ కనిపిస్తున్నారు. ఈ పాటని సిద్ శ్రీరామ్ పాడారు.

trending memes on sarkaru vaari paata kalaavathi song

ఈ పాట ప్రోమో విడుదల అయినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే విధంగా నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. దానికి కారణం ఈ పాట అంతకుముందు తమన్ స్వరపరిచిన ఒక పాటకి దగ్గరగా ఉండటమే.

#1

#2#3

ఈ పాట ప్రోమోలో ఉన్న ట్యూన్ చూస్తే అంతకుముందు తమన్ కంపోజ్ చేసిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో ఇది నేనేనా పాటలాగా ఉంది అని కామెంట్ చేశారు నెటిజన్లు. కానీ ఇప్పుడు పాట వేరేగా ఉంది. పాట విడుదలైన కొంతసేపట్లోనే యూట్యూబ్‌లో రికార్డ్ కూడా క్రియేట్ చేసింది.

#4#5#6

ప్రస్తుతం కళావతి పాట ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాటకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహారించారు. ఇంక సినిమా విషయానికొస్తే, సర్కారు వారి పాట విడుదల ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. ఇప్పుడు మేలో విడుదల అవ్వబోతోంది.

#7#8#9

షూటింగ్ కూడా దాదాపు పూర్తి అయినట్టు సమాచారం. తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు.

#10#11

ఆ తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వం వహించబోతున్న సినిమాలో కూడా నటిస్తారు. ఇది పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అవుతుంది. వీరిద్దరూ ఎన్నో సంవత్సరాల క్రితం సినిమా చేయాల్సి ఉంది. కానీ వేరే సినిమాల్లో బిజీ అవ్వడం వల్ల అది లేట్ అయ్యింది.  ఈ సినిమాకి సంబంధించిన కథ పనులు విజయేంద్ర ప్రసాద్ మొదలుపెట్టినట్లు సమాచారం.

#12#13#14

అయితే ముందు ట్రోల్ చేసినా కూడా ఇప్పుడు పాట వేరేగా ఉంది. దాంతో ఏది ఇప్పుడు ట్రోల్ చేయండి అంటూ ఇలా మీమ్స్ వస్తున్నాయి.

#15#16#17
#18


End of Article

You may also like