“అన్ని సినిమాలు కలిపి చూసినట్టు ఉంది..!” అంటూ… షారూఖ్ ఖాన్ “జవాన్” ప్రివ్యూపై 15 మీమ్స్..!

“అన్ని సినిమాలు కలిపి చూసినట్టు ఉంది..!” అంటూ… షారూఖ్ ఖాన్ “జవాన్” ప్రివ్యూపై 15 మీమ్స్..!

by kavitha

Ads

‘పఠాన్’ వంటి వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించిన బ్లాక్ బస్టర్ మూవీ తరువాత వస్తున్న మూవీ కావడంతో ‘జవాన్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా కమర్షియల్ సినిమాలతో హిట్స్ ఇచ్చిన కోలీవుడ్ డైరెక్టర్  అట్లీ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ జవాన్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది

Video Advertisement

తాజాగా జవాన్ మూవీ మేకర్స్ జవాన్ ట్రైలర్ ప్రీవ్యూను విడుదల చేశారు. ఇందులో షారుక్‌ ఖాన్ నటన, యాక్షన్‌  షారుక్ అభిమానులకు గూస్‌బంప్స్‌ ను తెప్పిస్తోంది. ఈ ప్రివ్యూ పై సోషల్ మీడియాలో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.. jawan-prevueబాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, దీపిక పదుకొనే, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా జవాన్.  మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రవించందర్‌ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రివ్యూ రిలీజ్ అయ్యింది. 2 నిమిషాల 12సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోని జాగ్రత్తగా, స్టోరీ అంతగా అర్ధమయ్యే అవకాశం ఇవ్వకుండా గ్రాండ్ విజువల్స్ తో ఎడిట్ చేశారు. షారుఖ్ బ్యానర్ అయిన రెడ్ చిల్లీస్ యూట్యూబ్ ఛానల్ లో అన్ని లాంగ్వేజెస్ కి సంబంధించిన వెర్షన్లు పెట్టారు.
jawan-prevue‘ఎవరు నేను, ఏవరిని కాను, తెలియదు. తల్లికిచ్చిన మాట కావచ్చు. నేరవేరని లక్ష్యం కావచ్చు’ అంటూ మొదలైన ప్రివ్యూ ఆద్యంతం షారుక్ డైలాగ్స్, లుక్స్, యాక్షన్ తో ఆకట్టుకుంది. ఇందులో షారుక్ పోలీస్ డ్రెస్ లో, ఆర్మీ ఆఫీసర్ గా కనిపించారు. ఇక చివర్లో గుండుతో కనిపించి ఆశ్చర్యపరిచారు. ‘ఇది ఆరంభం మాత్రమే’ మరియు ‘నేను విలన్ అయితే ఏ హీరో నా ముందు నిలబడలేడు’ అని చెప్పే షారుక్ డైలాగ్స్ ప్రివ్యూకి హైలైట్ గా నిలిచాయి.
jawan-previewవిజయ్ సేతుపతి లుక్ బాగుంది. అయితే ఆయన పాత్రని రివీల్ చేయలేదు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె యాక్షన్ షాట్ బాగుంది. స్టైలిష్ ఆఫీసర్ గా నయనతారను చూపించారు. ఇది ఇలా ఉంటే జవాన్ ట్రైలర్ ప్రివ్యూ పై సోషల్ మీడియాలో లు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి మీరు చూడండి..

1.  2.
3.
4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. 16. 17. 18.

watch video :

Also Read: “పుష్ప 2 ది రూల్” మూవీ ఐటెమ్ సాంగ్ కోసం మేకర్స్ ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా..?


End of Article

You may also like